BYD : ఎలన్ మస్క్ టెస్లా భారతదేశానికి ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ చైనాకు చెందిన BYD మాత్రం దానికి గట్టి పోటీనిస్తోంది. ఇటీవల టెస్లా తన కార్లను బుక్ చేసుకున్న వారికి డబ్బులు తిరిగి ఇవ్వడం ప్రారంభించింది. ఈ సమయంలో BYD భారతదేశంలో మరొక కారును విడుదల చేసింది. అదే 2025 BYD సీల్ కారు.
BYD సీల్ 2025 ఒక లగ్జరీ సెడాన్ కారు. దీని ప్రారంభ ధర భారతదేశంలో రూ.41 లక్షలు. ఇది డైనమిక్ (రియర్ వీల్ డ్రైవ్) వేరియంట్ ధర. అయితే దీని ప్రీమియం (రియర్ వీల్ డ్రైవ్) వేరియంట్ ధర రూ.45.70 లక్షలు, పెర్ఫార్మెన్స్ (ఆల్ వీల్ డ్రైవ్) వేరియంట్ ధర రూ.53.15 లక్షలు.
BYD సీల్ ఇప్పటికే భారతదేశంలో అమ్ముడవుతోంది. అయినప్పటికీ 2025 మోడల్‌లో కంపెనీ అనేక అప్‌డేట్‌లు చేసింది. ఈ కారు బేస్ మోడల్ ధరను ముందున్నంతగానే ఉంచగా, టాప్ వేరియంట్‌ల ధరలను ఒక్కో కారుపై రూ.15,000 పెంచారు. BYD సీల్ డైనమిక్ వేరియంట్‌లో 61.44 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది 201 bhp పవర్, 310 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 510 కిమీ వరకు రేంజ్ లభిస్తుంది.
Also Read : భారత్‌లో బీవైడీ విప్లవం.. తక్కువ ధరకే ఎలక్ట్రిక్ కార్లు!
అయితే దీని ప్రీమియం వేరియంట్‌లో 82.56 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 650 కిమీ వరకు వెళ్తుంది. దీని గరిష్ట పవర్ 308 bhp, గరిష్ట టార్క్ 360 Nm. కారు పెర్ఫార్మెన్స్ వేరియంట్‌లో ప్రీమియం వేరియంట్‌లోని బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. కానీ ఆల్-వీల్ డ్రైవ్ కారణంగా ఇందులో పవర్ 523 bhp, టార్క్ 670 Nm ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఇది 580 కిమీ వరకు దూరం ప్రయాణిస్తుంది.
ఈ కారుతో కంపెనీ ఫాస్ట్ ఛార్జర్ ఆప్షన్‌ను అందిస్తోంది. BYD సీల్ డైనమిక్ వేరియంట్‌ను 7 kW AC, 110 kW ఛార్జర్‌తో ఛార్జ్ చేయవచ్చు. అయితే ప్రీమియం, పెర్ఫార్మెన్స్‌లను 150 kW ఛార్జర్‌తో కూడా ఛార్జ్ చేయవచ్చు. టెస్లా తన మునుపటి బుకింగ్‌ల డబ్బును తిరిగి ఇస్తూ కస్టమర్‌లకు ‘థాంక్యూ’ మెయిల్ చేసిన సమయంలో BYD ఈ కారు భారతదేశంలో విడుదలైంది. అయితే ఈసారి టెస్లా షోరూమ్‌ల నుంచి సిబ్బంది నియామకం వరకు అన్ని పనులు పూర్తి చేసింది. ఇది ఈ సంవత్సరం విడుదలయ్యే అవకాశం ఉంది.
Also Read : ఈ టెక్నాలజీ నిజంగా గేమ్ ఛేంజర్.. 5 నిమిషాల్లోనే కారుకు ఫుల్ ఛార్జింగ్