Homeబిజినెస్BYD Budget Car: బడ్జెట్ కారును తీసుకొచ్చిన లగ్జరీ కార్ల కంపెనీ.. ఇక వాటికి హడలే..

BYD Budget Car: బడ్జెట్ కారును తీసుకొచ్చిన లగ్జరీ కార్ల కంపెనీ.. ఇక వాటికి హడలే..

BYD Budget Car: లగ్జరీ కార్ల కంపెనీ BYD(Build Your Dream)ప్రపంచంలో టెస్లా వంటి కంపెనీలతో పోటీ పడుతూ ఉంటుంది. లగ్జరీ కార్లను మాత్రమే మార్కెట్లోకి తీసుకొచ్చే ఈ కంపెనీ నుంచి కేవలం ఖరీదైన కార్లు మాత్రమే కాకుండా బడ్జెట్ కార్లను కూడా తీసుకురావడానికి సిద్ధమవుతోంది. అయితే ఇప్పటికే చైనాలో ఇలాంటి కార్లను రిలీజ్ చేసి గుర్తింపు తెచ్చుకున్న బీవైడీ ఇప్పుడు భారత మార్కెట్లోకి రూ.10 లక్షల లోపు కార్లను తీసుకురానుంది. దీంతో ఈ బడ్జెట్ లో […]

BYD Budget Car: లగ్జరీ కార్ల కంపెనీ BYD(Build Your Dream)ప్రపంచంలో టెస్లా వంటి కంపెనీలతో పోటీ పడుతూ ఉంటుంది. లగ్జరీ కార్లను మాత్రమే మార్కెట్లోకి తీసుకొచ్చే ఈ కంపెనీ నుంచి కేవలం ఖరీదైన కార్లు మాత్రమే కాకుండా బడ్జెట్ కార్లను కూడా తీసుకురావడానికి సిద్ధమవుతోంది. అయితే ఇప్పటికే చైనాలో ఇలాంటి కార్లను రిలీజ్ చేసి గుర్తింపు తెచ్చుకున్న బీవైడీ ఇప్పుడు భారత మార్కెట్లోకి రూ.10 లక్షల లోపు కార్లను తీసుకురానుంది. దీంతో ఈ బడ్జెట్ లో ఇప్పటికే రిలీజ్ చేసిన కంపెనీలు షాక్ అవుతున్నట్లు తెలుస్తోంది. అసలు బీవైడీ తీసుకొచ్చే మిడిల్ క్లాస్ కారు ఎలా ఉండబోతుంది? దీని ఫీచర్లు ఎలా ఉండనున్నాయి? దీని ధర ఎంత ఉండనుంది?

భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరిగిపోతుంది. ఇప్పటికే చాలా కంపెనీలు ఈవీలను తీసుకొచ్చి వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. అయితే ఇప్టపికే లగ్జరీ ఈవీలను తీసుకొచ్చి ప్రపంచ గుర్తింపు పొందిన బీవైడీ ఇప్పుడు భారత్ లో బడ్జెట్ కారు Seagullను రిలీజ్ చేయబోతుంది. ఇప్పటికే చైనాలో దీనిని లాంచ్ చేశారు. ఇది రిలీజ్ అయిన ఒక్కరోజులోనే 10 వేలకు పైగా బుకింగ్స్ వచ్చాయంటే ఈ కారుకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో దీనిని భారత్ లో కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే దీని పనులు ప్రారంభించినట్లు సమాచారం.

BYD నుంచి రాబోడే బడ్జెట్ కారు Seagull ఎలక్ట్రిక్ హ్యాచ్ బ్యాక్ కారు. దీని డిజైన్ చూస్తే ఎవరికైనా వెంటనే కొనాలని అనిపిస్తుంది. పూర్తిగా స్టైలిష్ గా ఉండే ఈ కారు 5 డోర్లను కలిగి ఉంటుంది. ఐస్ బ్రేకింగ్ సిస్టమ్ తో పాటు హెడ్ లైట్స్, బ్యాక్ సైడ్ కనెక్టింగ్ ఎల్ ఈడీ టెయిల్ లైట్స్ ఆకర్షణీయింగా ఉంటాయి. ఈ కారులో 30 kWhబ్యాటరీ ప్యాక్ ను అమర్చారు. దీనిని ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 305 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో వెళ్లే ఈ కారులో ఇంటీరియర్ ఫీచర్లు కూడా ఆకట్టుకుంటాయి. ఇందలుో 12.8 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కలిగిన స్క్రీన్ ఉండనుంది. 5 అంగుళాల డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ కన్సోల్, వైర్ లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే డ్రైవర్ కు అనుగుణంగా అడ్జస్టబుల్ సీట్లు ఉన్నాయి.

సీగుల్ కారు మార్కెట్లో (ఇండియన్ కరెన్సీ ప్రకారం) రూ.9.4 లక్షల నుంచి రూ. 11.4 లక్షల వరకు విక్రయించారు. భారత్ లో కూడా దీనిని రూ.10 లక్షల వరకు అమ్ముతారని అంటున్నారు. దీంతో ఇప్పటి వరకు ఈ రేంజ్ లో మార్కెట్లోకి తీసుకొచ్చిన కార్ల కంపెనీల్లో ఆందోళన నెలకొంది. బడ్జెట్ లోనే ప్రీమియం ఫీచర్లు కలిగిన ఈ కారు మిగతా కార్లకు గట్టిపోటీ ఇస్తుందని అంటున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper