https://oktelugu.com/

సెకండ్ హ్యాండ్ వాహనం కొనుగోలు చేస్తున్నారా.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే?

కరోనా మహమ్మారి ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. కరోనా వైరస్ వల్ల చాలామంది పబ్లిక్ వాహనాలలో తిరగడానికి ఇష్టపడటం లేదు. సొంత వాహనాలపై ఆసక్తి చూపే ప్రజల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మరోవైపు సెకండ్ హ్యాండ్ వాహనాలకు సైతం డిమాండ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. మధ్యతరగతి ప్రజలు కూడా సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే చాలామంది ఇన్సూరెన్స్ లేని, సరైన డాక్యుమెంట్లు లేని వాహనాలను కొనుగోలు చేయడం వల్ల ఇబ్బందులను […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 10, 2021 / 06:37 PM IST
    Follow us on

    కరోనా మహమ్మారి ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. కరోనా వైరస్ వల్ల చాలామంది పబ్లిక్ వాహనాలలో తిరగడానికి ఇష్టపడటం లేదు. సొంత వాహనాలపై ఆసక్తి చూపే ప్రజల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మరోవైపు సెకండ్ హ్యాండ్ వాహనాలకు సైతం డిమాండ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. మధ్యతరగతి ప్రజలు కూడా సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

    అయితే చాలామంది ఇన్సూరెన్స్ లేని, సరైన డాక్యుమెంట్లు లేని వాహనాలను కొనుగోలు చేయడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సెకండ్ హ్యాండ్ వాహనాలను కొనుగోలు చేసే సమయంలో ఇన్సూరెన్స్ ను తప్పనిసరిగా చెక్ చేయాలి. వాహనం గురించి ఎలాంటి అనుమానం ఉన్నా ఆన్ లైన్ లో ఆ వివరాలను చెక్ చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. వాహనం ఇన్సూరెన్స్, డాక్యుమెంట్స్ వివరాలను చెక్ చేసుకోవాలంటే http://www.uiic.in/vahan/iib_query.jsp వెబ్ సైట్ లో వాహనాల వివరాలను చెక్ చేసుకోవచ్చు.

    అయితే వివరాలను చెక్ చేసుకోవాలని భావించే వాళ్లు వెహికిల్ నంబర్, ఇంజిన్ నంబర్ వివరాలను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత వాహనంకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడం సాధ్యమవుతుంది. ఇలా చేయడం ద్వారా ఇన్సూరెన్స్‌ నంబర్ ఇన్సూరెన్స్‌ ప్రస్తుత స్థితి, ఇన్సూరెన్స్‌ వ్యవధి, ఇన్సూరెన్స్‌ గడువు తేదీ వివరాలను సులభంగా పొందడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు.

    క్లెయిమ్ రకం, క్లెయిమ్ తేదీ, దావా కారణం మొదలైన వివరాలను కూడా ఈ విధంగా తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది. సెకండ్‌ హ్యాండ్‌ వాహనాలను కొనుగోలు చేస్తుంటే ఈ వివరాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి.