https://oktelugu.com/

Pushpa: ‘ఊ అంటావా మామా.. ఊఊ అంటావా మామా’.. పుష్ప ఐటెం సాంగ్ రిలీజ్​

Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం మొదటి పార్ట్ పుష్ప ది రైజ్ డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు విడుదలై ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్రం నుండి విడుదల […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 10, 2021 / 06:40 PM IST
    Follow us on

    Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం మొదటి పార్ట్ పుష్ప ది రైజ్ డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు విడుదలై ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్రం నుండి విడుదల అయిన ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం లోని ఒక ఐటమ్ సాంగ్ లో టాలీవుడ్ బ్యూటీ సమంత స్టెప్పులేయనున్న సంగతి తెలిసిందే.

    తాజాగా ఈ సినిమాలోని ఐటెం సాంగ్ లిరికల్​  వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. ఊ అంటావా మామా. ఊఊ అంటావా మామా పేరుతో వచ్చిన ఈ సాంగ్​లో సమంత హాట్​ లుక్​లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ అందుకు తగ్గట్లుగానే మంచి రిథమున్న మ్యూజిక్​ అందించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి నాలుగు పాటలు విడుదల కాగా.. అన్నీ భారీ వ్యూస్​తో దూసుకెళ్లిపోయాయి. మరి సమంతను ఈ సాంగ్​లో ఎలా అందాలు ఆరబెట్టిందో తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.

    గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ చేసిన ఈ స్పెషల్ నంబర్‌ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన నటిస్తోంది.  మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.