Business Tips : తక్కువ స్థలంలో ఎరువులు మరియు విత్తనాల సహాయంతో పుట్టగొడుగులను పెంచుకోవచ్చు. ఈ వ్యాపారానికి ప్రభుత్వం 50% సబ్సిడీని కూడా అందిస్తుంది. మనదేశంలో అనేక రకాల పుట్టగొడుగులు కనిపిస్తూ ఉంటాయి. మంచి ఆదాయం సంపాదించుకోవడం కోసం రైతులు తెల్ల వెన్న పుట్టగొడుగులు, మిల్క్ పుట్టగొడుగులు, వొస్తార్ పుట్టగొడుగులు, పాడిస్తా పుట్టగొడుగులు మరియు షిటేక్ పుట్టగొడుగులను పెంచుతున్నారు. అదనపు ఆదాయం కోసం మనదేశంలో రైతులు వ్యవసాయంతో పాటు పుట్టగొడుగులను పెంచే వ్యాపారం కూడా చేస్తున్నారు. కానీ ప్రస్తుతం ఇది నిరుద్యోగులకు ప్రధాన ఆదాయ వనరుగా మారుతుంది. ఈ వ్యాపారంలో మంచి దిగుబడిని పొందడానికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఎరువులు మరియు విత్తనాల సహాయంతో మట్టి లేకుండా 4*4 గదిలో పుట్టగొడుగులను సులభంగా పెంచవచ్చు. తక్కువ సమయంలో మంచి లాభాలను తెచ్చిపెట్టే పుట్టగొడుగుల రకాలను పెంచవచ్చు. అలాగే మీకు సమీపంలో ఉన్న మార్కెట్లో పుట్టగొడుగుల డిమాండ్ ను బట్టి ఉత్పత్తి కూడా చేయవచ్చు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 70 రకాల సాగు పుట్టగొడుగులు ఉన్నాయని తెలుస్తుంది. అయితే మనదేశంలో తెల్ల వెన్నపుట్టగొడుగులు, వొస్తర్ పుట్టగొడుగులు, సెప్ పుట్టగొడుగులు, షిటేక్ పుట్టగొడుగులు మరియు మిల్క్ పుట్టగొడుగులకు బాగా డిమాండ్ ఉంది. ఇవి మంచి లాభాలను తెచ్చి పెడతాయి.
Also Read : ఎండల్లో హాయ్ హాయ్..రూ.5000 లోపు లభించే 5 ఎయిర్ కూలర్లు!
ఈ వ్యాపారానికి కావాల్సిన అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే ఈ వ్యాపారం కోసం ఎక్కువ నేల అవసరం ఉండదు. వీటిని పెంచడానికి ఒక పెద్ద ప్లాస్టిక్ సంచి, కంపోస్ట్, గోధుమ మరియు బియ్యం బీజాలు వీటికి సరిపోతాయి. వీటిని మీరు ఒకవేళ పెంచాలని అనుకుంటే ఒక చిన్న స్థలంలో ఒక షెడ్డు నిర్మించి దానిని చెక్క మరియు వలలతో తప్పడం ద్వారా ఈ వ్యాపారం చేయడానికి ప్రయత్నించవచ్చు. ఒకవేళ మీరు వీటిని మీ ఇంట్లో పెంచాలని అనుకుంటే ముందుగా వరి గోధుమ గడ్డిని కంపోస్ట్ ఎరువులతో కలిసిన ప్లాస్టిక్ సంచిలో పెట్టాలి. ఆ తర్వాత పుట్టగొడుగు విత్తనాలను కంపోస్టు నింపిన సంచిలో ఉంచి దానిలో చిన్న రంధ్రాలను చేయాలి.
పుట్టగొడుగు పెరిగేకొద్దీ ఈ రంధ్రాల ద్వారా బయటకు వస్తుంది. విత్తనాలు నాటిన తర్వాత మీరు 15 రోజుల వరకు షెడ్ గాలికి తగలకుండా ప్రత్యేక జాగ్రత్తను తీసుకోవాలి. విత్తనాలు నాటిన 15 రోజుల తర్వాత షెడ్ లో ఫ్యాన్లు వేసి గాలి ఆడనివ్వాలి. ఆ తర్వాత 30 నుంచి 40 రోజుల వరకు పుట్టగొడుగుల పంటను పండనివ్వాలి. ఈ వ్యాపారానికి ప్రభుత్వం 50% సబ్సిడీని కూడా అందిస్తుంది.
Also Read : ఈ మండే వేసవిలో అమెజాన్ లో ఏసీలపై భారీ డిస్కౌంట్లు..