Childhood Photo : సోషల్ మీడియాలో కూడా ఈ బ్యూటీ కి ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటోలో తన తల్లి ఒడిలో కూర్చున్న ఈ చిన్నారి సౌత్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోయిన్. సామాజిక మాధ్యమాలలో ప్రస్తుతం ఒక స్టార్ హీరోయిన్ కు సంబంధించిన చిన్ననాటి ఫోటో ఒకటి అందరిని బాగా ఆకట్టుకుంటుంది. వైరల్ అవుతున్న ఫోటోలో తన తల్లి ఒడిలో అమాయకంగా కూర్చున్న ఈ చిన్నారి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఒక టాప్ హీరోయిన్. వరుసగా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ బ్యూటీ కంటెంట్ మరియు పాత్ర ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ గ్లామర్ షోకు దూరంగా ఉంటూ తన సహజ నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఈ అమ్మడు సినిమాలో హీరో పాతులతో పాటు తన పాత్రకు కూడా సరైన ప్రాధాన్యత ఉంటేనే సినిమాకు ఓకే చెప్తుంది. అందుకే ఆమెకు యూత్లో ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ఈ బ్యూటీ లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసి స్టార్ హీరోలకు మించిన సొంతం చేసుకుంది. అందుకే ఆమె అభిమానులు ఆమెను లేడీ పవర్ స్టార్ అంటూ ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. ఇంతకీ బ్యూటీ ఎవరో మీరు గుర్తుపట్టారా. ఈమె మరెవరో కాదు ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ హీరోయిన్ సాయి పల్లవి. నేచురల్ బ్యూటీ సాయి పల్లవి చిన్ననాటి ఫోటో ఇది. ప్రేమమ్ అనే మలయాళీ సినిమాతో సాయి పల్లవి సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.
Also Read : ఇంట్లో నుంచే ఈ వ్యాపారం చేసి లక్షలు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసుకోండి..
మొదటి సినిమాతోనే ఊహించని క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్గా పరిచయమైంది. తెలుగుతోపాటు సాయి పల్లవి తమిళ్, మలయాళం లో వరుస సినిమా అవకాశాలు అందుకొని అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. లేటెస్ట్ గా ఈ చిన్నది తందేల్ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో సాయి పల్లవి అక్కినేని నాగచైతన్యకు జోడిగా తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి భారీ విజయం అందుకుంది. ప్రస్తుతం సాయి పల్లవి హిందీలో రామాయణం సినిమాలో నటిస్తుంది.
ఈ సినిమాలో హీరోయిన్ సాయి పల్లవి సీత పాత్రలో కనిపించబోతుంది. అలాగే ఈ సినిమాలో రాముడిగా బాలీవుడ్ స్టార్ నటుడు రణబీర్ కపూర్ కనిపించబోతున్నారు. మూడు భాగాలుగా వస్తున్న ఈ సినిమా కోసం నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ఏకంగా 30 కోట్లు పారితోషకం అందుకుందని సమాచారం. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమాకు నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో పాటు సాయి పల్లవి తెలుగులో కూడా మరికొన్ని సినిమాలకు ఓకే చెప్పినట్లు సమాచారం.
Also Read : అమెరికాలో జాబ్ వదిలేసి సినిమాల్లోకి ఎంట్రీ.. మల్టీ టాలెంటెడ్ బ్యూటీగా గుర్తింపు.. ఎవరో గుర్తుపట్టారా..