https://oktelugu.com/

వాహనదారులకు బంపర్ ఆఫర్.. రూ.4,999 చెల్లిస్తే ఇంటికి స్కూటర్..!

దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్లు అందుబాటులోకి వస్తున్నాయి. కొత్త స్కూటర్ లేదా బైక్ కొనుగోలు చేయాలనుకునే వారికి కంపెనీలు శుభవార్త చెబుతున్నాయి. తక్కువ మొత్తం చెల్లించి బైక్ లేదా స్కూటర్ ను కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. దేశంలోని ప్రముఖ టూవీలర్ కంపెనీలలో ఒకటైన హీరో మోటొకార్ప్ వినియోగదారుల కోసం అదిరిపోయే ఆఫర్ ను తీసుకొచ్చింది. హీరో మోటొకార్ప్ పండగ ఆఫర్ లో భాగంగా పరిమిత కాలానికి మాత్రమే ఈ ఆఫర్ ను […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 21, 2020 / 07:59 AM IST
    Follow us on

    దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్లు అందుబాటులోకి వస్తున్నాయి. కొత్త స్కూటర్ లేదా బైక్ కొనుగోలు చేయాలనుకునే వారికి కంపెనీలు శుభవార్త చెబుతున్నాయి. తక్కువ మొత్తం చెల్లించి బైక్ లేదా స్కూటర్ ను కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. దేశంలోని ప్రముఖ టూవీలర్ కంపెనీలలో ఒకటైన హీరో మోటొకార్ప్ వినియోగదారుల కోసం అదిరిపోయే ఆఫర్ ను తీసుకొచ్చింది.

    హీరో మోటొకార్ప్ పండగ ఆఫర్ లో భాగంగా పరిమిత కాలానికి మాత్రమే ఈ ఆఫర్ ను అందిస్తుండటంగ్ గమనార్హం. ఆఫర్ లో భాగంగా వినియోగదారులు స్కూటర్ ను కొనుగోలు చేస్తే 7,000 రూపాయల మేర ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. హీరో మోటోకార్ప్ కేవలం 4,999 రూపాయలు మాత్రమే డౌన్ పేమెంట్ చెల్లించి బైక్ లేదా స్కూటర్ ను కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. వాయిదాల రూపంలో మిగిలిన మొత్తాన్ని చెల్లించవచ్చు.

    6.9 శాతం వడ్డీరేటు మాత్రమే కావడంతో వినియోగదారులపై కూడా ఎక్కువ భారం పడదు. కొన్ని రోజులు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు లేదా సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డును ఉపయోగించి బైక్ లేదా స్కూటర్ ను కొనుగోలు చేస్తే 5,000 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుందని పేటీఎం ద్వారా లావాదేవీలు నిర్వహిస్తే 2,500 రూపాయల వరకు సులభంగా క్యాష్ బ్యాక్ ను పొందవచ్చని సమాచారం.

    ఎక్స్‌పల్స్ 200 వెహికల్స్‌, హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ లపై హీరో మొటొకార్ఫ్ ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ వాహనాలపై 7,000 రూపాయల వరకు ఎక్స్చేంజ్ టాపప్, లాయల్టీ టాపప్, కార్పొరేట్ భాగస్వామ్యం కింద ప్రయోజనాలు కలగనున్నాయి. హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లతో పాటు హీరో బైక్స్, స్కూటర్లపై అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.