https://oktelugu.com/

BSNL Recruitment: ఈసీఈ డిప్లొమా చదివిన వాళ్లకు శుభవార్త.. బీఎస్‌ఎన్‌ఎల్‌లో జాబ్స్!

BSNL Recruitment: భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌) ఈసీఈ/టెక్నాలజీలో డిప్లొమా చదివిన వాళ్లకు తీపికబురు అందించింది. హైదరాబాద్, తెలంగాణలో అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలకు భర్తీ చేయడానికి బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ సిద్ధమైంది. మొత్తం 22 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అప్రెంటిస్‌షిప్‌ నిబంధనల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు ఆధారపడి ఉంటుంది. ఆన్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 26, 2021 6:24 pm
    Follow us on

    BSNL Recruitment: భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌) ఈసీఈ/టెక్నాలజీలో డిప్లొమా చదివిన వాళ్లకు తీపికబురు అందించింది. హైదరాబాద్, తెలంగాణలో అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలకు భర్తీ చేయడానికి బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ సిద్ధమైంది. మొత్తం 22 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అప్రెంటిస్‌షిప్‌ నిబంధనల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు ఆధారపడి ఉంటుంది.

    BSNL Recruitment

    BSNL Recruitment

    ఆన్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నేషనల్‌ అప్రెంటిస్‌షిప్‌ ట్రైనింగ్‌ స్కీమ్‌ లేదా బీఎస్‌ఎన్‌ఎల్ పోర్టల్‌ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లకు హైదరాబాద్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌లో సంవత్సరం పాటు శిక్షణ ఇస్తారు. మెరిట్‌ మార్కులు, సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ ను బట్టి ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది.

    Also Read: గుంటూరు డీసీసీబీలో ఉద్యోగ ఖాళీలు.. అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారంటే?

    2021 సంవత్సరం నవంబర్ నెల 20వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. నాట్స్ పోర్టల్ ద్వారా 2021 సంవత్సరం నవంబర్ 29వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. 2021 సంవత్సరం డిసెంబర్ 2వ తేదీ బీ.ఎస్.ఎన్.ఎల్ పోర్టల్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది. http://www.telangana.bsnl.co.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

    వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరగనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ మొత్తంలో వేతనం లభించనుంది.

    Also Read: ఉద్యోగుల జీతాలను సంస్థలు రహస్యంగా ఎందుకు ఉంచుతాయి?