Gold Rate: బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం 10 గ్రాముల బంగారానికి రూ.1.70 లక్షల పై మాటే. దీంతో సామాన్యలో బంగారం కొనలేని పరిస్థితికి వచ్చింది. ముఖ్యంగా ఆదాయం తక్కువగా ఉన్నవారు బంగారానికి బదులు ఇతర లోహాల గురించి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అటు వెండి ధరలు కూడా పెరగడంతో బంగారం వెండి ధరలు సామాన్యులకు దూరంగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో భవిష్యత్తులో మహిళలు బంగారానికి బదులు చెక్కతో తయారుచేసిన మంగళసూత్రం ధరించాల్సిన పరిస్థితి వచ్చే అవకాశాలు ఉన్నాయని కొందరు అంచనా వేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలోనే వెల్లడించినట్లు మరికొందరు ఆధ్యాత్మిక వాదులు తెలుపుతున్నారు..
పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం ప్రకారం మహిళలు బంగారం నాకు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకానొక సందర్భంలో బంగారం ధరలు పెరిగి అది సామాన్యులకు అంటరాని వస్తువుగా మారిపోయే ప్రమాదం అవుతుంది. దీంతో తక్కువ ఆదాయం ఉన్నవారు పెళ్లిళ్ల సమయంలో బంగారం నకు బదులుగా చెక్కతో తయారుచేసిన మంగళసూత్రంను ధరించే పరిస్థితి కూడా రావచ్చు అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో తెలిపారు. భారతదేశంలో హిందూ సాంప్రదాయం ప్రకారం మంగళసూత్రంను పవిత్ర మైన ఆభరణం గా భావిస్తారు. పెళ్లిళ్ల సమయంలో బంగారంతో తయారుచేసిన తాళిబొట్టునే ధరిస్తారు. ఎందుకంటే బంగారం ను మహిళలు లక్ష్మీతో భావిస్తారు. బంగారంతో తయారుచేసిన ఈ మంగళసూత్రంను ధరించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని అనుకుంటారు.
అయితే ప్రస్తుతం బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతుండడంతో భవిష్యత్తులో ఒక గ్రామం బంగారం కొన్ని పరిస్థితి కూడా ఉండకపోవచ్చు అని అంటున్నారు. భవిష్యత్తులో రూ.2 లక్షల పైకి బంగారం ధరలు పెరిగితే సామాన్యులు దీనికి దూరమయ్యే అవకాశం ఉంది. అయితే బంగారం ధరలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ఏర్పడిన పరిస్థితులతో పాటు అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వివిధ దేశాలపై విధిస్తున్న టాక్స్ లతో మిగతా వాటికంటే బంగారం పైనే ఎక్కువగా పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. భవిష్యత్తులో బంగారమే సురక్షితమైన పెట్టుబడిగా మారే అవకాశం ఉందని అంటున్నారు. ఒక కంపెనీకి చెందిన బాండ్లు మెరుగ్గా ఉంటేనే లాభాలు వస్తాయి. కానీ ఇటీవల ట్రంపు బ్యాంకుల వడ్డీ రేట్లు తగ్గించడంతో వీటిపై ఇన్వెస్ట్మెంట్ చేస్తే నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చాలామంది భావిస్తున్నారు.
అంతేకాకుండా 2025 సంవత్సరంలో కేంద్రీయ బ్యాంకులు టన్నులకొద్దీ బంగారాన్ని కొనుగోలు చేసినట్లు చాలామంది పెట్టుబడిదారులు గ్రహించారు. దీంతో బంగారాన్ని కొనుగోలు చేస్తే సురక్షితమని భావిస్తూ వీటిపై ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఫలితంగా బంగారం నకు డిమాండ్ రోజురోజుకు పెరుగుతుంది. భవిష్యత్తు గురించి చెప్పలేం కానీ ప్రస్తుతం అయితే బంగారం ధరలు తగ్గే అవకాశం లేదని తెలుస్తోంది. అంతర్జాతీయంగా మార్పులు వస్తే తప్ప బంగారం ధరలు ఇలాగే ఉంటాయని అంటున్నారు.