BMW 3 : కారు కొనాలనుకునేవారు బీఎం డబ్ల్యూ కారు ఉండాలని కోరుకునేవారు చాలా మందే. కానీ తక్కువ మంది వద్దే ఇది ఉంటుంది.ఎందుకంటే దీని ధర ఆకాశంలో ఉంటుంది. కానీప్రీమియం కార్లు కొనాలనుకునేవారికి మాత్రం ఇది పక్కగా సరిపోతుంది. బీఎండబ్ల్యూ నుంచి ఇప్పటికే వచ్చిన వివిధ మోడళ్లు ధనికుల వద్ద ఉన్నాయి. అయితే ఇప్పుడు లేటేస్టుగా మరో లగ్జరీ కారు మార్కెట్లోకి వచ్చింది. దీనికి ‘3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ ఎం స్పోర్ట్స్ ప్రో ఎడిషన్ ’గా నామకరణం చేసింది. దీని ధర, ఫీచర్లు చూస్తే మాత్రం కళ్లు తిరిగిపోతాయి. ఆ వివరాల్లోకి వెళితే..
బీఎండబ్ల్యూ నుంచి 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ ఎం స్పోర్ట్స్ ప్రో ఎడిషన్ ఇప్పటికే రిలీజ్ అయింది. అయితే ఇప్పుడు లేటేస్ట్ టెక్నాలజీతో పాటు కొన్ని ఫీచర్స్ ను జోడించింది. ఇందులో పెట్రోల్ ఇంజిన్ మాత్రమే అందుబాటులో ఉంది.అది 2.0 లీటర్ టర్బో ఇంజిన్ ను కలిగి ఉంది. ఇది 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ తో 258 హార్స్ పవర్, 400 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ పవర్ ఎలా ఉంటుందంటే 6.2 సెకనల్లో 0 నుంచి 100 కిలోమీటర్ల వరకు వెళ్తుంది.
బీఎం డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ ఎం స్పోర్ట్స్ ప్రో ఎడిషన్ కొత్త ఫీచర్ష్ అదుర్స్ అని చెప్పొచ్చు. ఇది 12.3అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ ప్లే, 14.9 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉన్నాయి. వైర్ లెస్ ఆపిల్ కార్ ప్లే తో పాటు ఆండ్రాయిడ్ ఆటో, త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్ చేస్తుంది. సౌండింగ్ కోసం 16 స్పీకర్ హర్మాన్ కార్డాన్ సరౌండ్ సిస్టమ్ ఆకర్షిస్తుంది. ఇక సెక్యూరిటీ కోసం 360 కెమెరా అమర్చారు.
ఈ మోడల్ లో షాడో లైన్ ఎలిమెంట్స్ తో పాటు అడాప్టివ్ ఎల్ ఈడీ హెడ్ లైట్లు, బ్లాక్ రియర్ డిప్యూజర్ వంటివి ఉన్నాయి. 3డీ వ్యూతో పార్కింగ్ అసిస్టెంట్ ప్లస్ ను అమర్చారు. ఆడి కారుతో పాటు మెర్సిడెస్ బ్రాండ్లకు ప్రత్యర్థిగా ఈ మోడల్ ను చెప్పుకుంటున్నారు. డిజైన్ అయితే అద్భుతమనే చెప్పొచ్చు. ఒక్కసారి చూడగానే కనెక్ట్ అయిపోతారు.