Adani`s Empire : ఆసియాలోనే అపర కుబేరుడు, ప్రపంచంలోనే టాప్ 4 ధనవంతుడు అయిన గౌతం అదానీ ఆర్థిక సామ్రాజ్యం కూలిపోతుందా? విచ్చలవిడిగా వివిధ రంగాల్లో పెడుతున్న పెట్టుబడులు వికటించి ఆయన అప్పుల ఊబిలో కూరుకుపోతాడా? అంటే ఔననే అంటోంది ఫిట్చ్ గ్రూప్ యూనిట్ క్రెడిట్‌సైట్స్ . ఈ మేరకు ఇది బయటపెట్టిన నివేదిక వ్యాపారవర్గాల్లో పెను సంచలనమైంది.
భారతీయ బిలియనీర్ గౌతమ్ అదానీ గ్రూపు ఇప్పటికే ఉన్న వ్యాపారాలు.. మరియు కొత్త వ్యాపారాలలో దూకుడుగా పెట్టుబడి పెడుతోంది. ప్రధానంగా రుణాలు తీసుకొని మరీ నిధులు సమకూరుస్తుంది. ఇదే ఆ కంపెనీ కొంప ముంచేలా ఉందని ఫిట్చ్ గ్రూప్ యూనిట్ క్రెడిట్‌సైట్స్ నివేదికలో సంచలన విషయం బయటపెట్టింది.
ఆసియాలోని అత్యంత సంపన్న వ్యక్తి నేతృత్వంలోని అదానీ గ్రూప్ అనుసరిస్తున్న దూకుడు విస్తరణ దాని క్రెడిట్ కొలమానాలు.. నగదు ప్రవాహంపై ఒత్తిడి తెచ్చిందని క్రెడిట్‌సైట్స్ మంగళవారం నివేదికలో పేర్కొంది, అదానీ గ్రూపులో ఇలాగే సాగితే ఇది రుణ ఉచ్చులో కూరుకుపోవచ్చని పేర్కొంది. డిఫాల్ట్ కంపెనీగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఈ నివేదికపై స్పందించాలని చేసిన అభ్యర్థనకు అదానీ గ్రూప్ ప్రతినిధి స్పందించలేదు. ఏడు లిస్టెడ్ అదానీ గ్రూప్ కంపెనీల్లో ఐదు మంగళవారం నష్టాల్లో ముగియడంతో దీనికి బలం చేకూరింది. విమానాశ్రయాలు, డేటా సెంటర్లు మరియు సిమెంట్‌తో పాటు గ్రీన్ ఎనర్జీ, ఓడరేవులు మరియు బొగ్గు తవ్వకాలపై కేంద్రీకృతమై అదానీ సామ్రాజ్యం విస్తరించింది. త్వరితగతిన వైవిధ్యభరితంగా సాగుతున్న అదానీ సామ్రాజ్యానికి క్రెడిట్‌సైట్స్ నివేదిక పెను విఘాతంగా మారింది. ఈ నివేదిక అదానీ ఆశయాలకు.. అతని సంస్థల షేర్లలో పెరుగుదలకు ఆటంకం కలిగించే బహుళ ఫాల్ట్ లైన్‌లపై దృష్టి సారించింది. అయితే క్రెడిట్‌సైట్స్ విశ్లేషకులు.. బ్యాంకులతో గ్రూప్‌కి ఉన్న బలమైన సంబంధాల నుండి.. అలాగే భారత ప్రధాని నరేంద్ర మోడీ పరిపాలన నుండి లభిస్తున్న మద్దతుతో అదానీ గ్రూపు నిలబడుతోందని.. ఇది ఎప్పుడైనా కూలిపోవచ్చని హెచ్చరించింది.
-క్రెడిట్ సైట్స్ నివేదికలోని ముఖ్యాంశాలు..
-అదానీ గ్రూప్ కొత్త, సంబంధం లేని వ్యాపారాలలోకి ప్రవేశిస్తోంది, ఇవి అధిక మూలధనాన్ని వెచ్చిస్తోంది. అమలు పర్యవేక్షణపై ఆందోళనలను పెంచుతున్నాయి.
-మార్కెట్ ఆధిపత్యాన్ని సాధించడానికి అదానీ గ్రూప్, అంబానీ రిలయన్స్ మధ్య సంభావ్య బలమైన పోటీ వల్ల “అవివేక ఆర్థిక నిర్ణయాలకు” దారితీస్తోందని.. ఇది కంపెనీని నష్టాలు పాలు చేయవచ్చు.
– అదానీ గ్రూప్ మితమైన స్థాయి పాలన, ఈఎస్జీ ప్రమాదాలకు కూడా గురవుతుంది
– అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ ద్వారా “బలమైన మరియు స్థిరమైన కంపెనీలను ఏర్పరచడంలో బలమైన ట్రాక్ రికార్డ్ కలిగి ఉంది. భారత ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యకరమైన పనితీరుతో ముడిపడి ఉన్న “స్థిరమైన మౌలిక సదుపాయాల ఆస్తుల” పోర్ట్‌ఫోలియోను అదానీ నిర్మించింది.
-గౌతం అదానీ.. మోడీ ప్రభుత్వంతో “బలమైన సంబంధాన్ని కలిగి ఉన్నారు.మరియు “పాలసీ టెయిల్‌విండ్స్” నుండి ప్రయోజనం పొందారు. దీంతో ఈ సంస్థ నిలబడుతోందని.. ఎక్కువగా రుణ నిధులతో సాగడానికి ఇదొక కారణమని పేర్కొన్నారు.
1980ల చివరలో అగ్రి-ట్రేడింగ్ సంస్థగా తన వ్యాపారాన్ని గౌతం అదానీ ప్రారంభించారు. ఈ సంవత్సరం ప్రపంచంలోనే టాప్ 4 ధనవంతుడిగా ఎదిగాడు. అదానీ గ్రూప్ జూలైలో ఇజ్రాయెల్‌లోని హైఫా పోర్ట్‌ను $1.2 బిలియన్లకు, స్విస్ సంస్థ హోల్సిమ్ యొక్క భారతీయ సిమెంట్ యూనిట్లను మేలో $10.5 బిలియన్లకు కొనుగోలు చేసింది. దాదాపు మూడు డజన్ల పెద్ద మరియు చిన్న కొనుగోళ్లతో భారీగా వెచ్చించింది. ఇది మీడియా, హెల్త్ కేర్ మరియు డిజిటల్ సేవలకు కూడా విస్తరిస్తోంది.
గ్రూప్ భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ పోర్ట్ ఆపరేటర్, బొగ్గు గని, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్, ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్‌లను కలిగి ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక విద్యుత్ జనరేటర్‌ను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరి అప్పులతో సాగుతున్న ఈ సంసారం ఎపప్పుడైనా కుప్ప కూలిపోవచ్చన్న ఆందోళనను క్రెడిట్ సైట్స్ నివేదిక పేర్కొంది.