The Plan Of Congress: మరికొద్ది రోజుల్లోనే మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే ఇక్కడ నామినేషన్ల ఘట్టం కూడా పూర్తయింది. దాంతో అన్ని పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. అభ్యర్థులు కూడా పోటాపోటీగా ప్రచారం పాల్గొంటున్నారు. గెలుపు కోసం పార్టీలు నానా ప్రయత్నాలు చేస్తున్నాయి. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా కీలక నేతలను ప్రచారంలోకి దింపుతున్నాయి. స్టార్ క్యాంపెయినర్లను సెలక్ట్ చేసి ప్రచారం పాల్గొనేలా చేస్తున్నాయి. ఒక్కో రాష్ట్రం నుంచి కీలక నేతలను రంగంలోకి తీసుకొస్తున్నాయి. అన్నిపార్టీలూ కూడా గెలుపే లక్ష్యంగా అస్త్రాలు సంధిస్తున్నాయి.
ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిష్టా్త్మకంగా తీసుకుంది. ఇప్పటికే హర్యానా ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన కాంగ్రెస్ ఈసారి ఆ తప్పిదం జరగకుండా జాగ్రత్తలు పడుతోంది. సర్వేల్లోనూ అధికారం చేపట్టే వరకు వచ్చిన కాంగ్రెస్‌కు హర్యానా ఓటమి జీర్ణించుకోలేని పరిస్థితి తీసుకొచ్చింది. అందుకే.. ఈసారి పకడ్బందీగా ముందుకు సాగుతోంది. అందులో భాగంగానే పొరుగు రాష్ట్రాలకు చెందిన వారిని స్టార్ క్యాంపెయినర్లుగా నియమించింది. ఈ మేరకు ఈ రెండు రాష్ట్రాల్లోనూ తెలంగాణ నుంచి సీఎం, డిప్యూటీ సీఎంలను సెలక్ట్ చేసింది. తెలంగాణతో సరిహద్దు పంచుకుంటున్న మహారాష్ట్ర ఎన్నికల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని స్టార్ క్యాంపెయినర్‌గా నియమించింది. త్వరలోనే రేవంత్ రెడ్డి మహారాష్ట్ర వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. తెలంగాణ నుంచి వెళ్లిన చాలా మంది ప్రజలు ముంబైలో స్థిరపడ్డారు. ఒక్క ముంబైలోనే కాకుండా భీవండితోపాటు ఇంకా చాలా ప్రాంతాల్లో తెలుగువారు లక్షల్లో ఉన్నారు. అటు హైదరాబాద్‌కు దగ్గరగా ఉండే నాందేడ్‌తో మరికొన్ని ప్రాంతాల్లో రేవంత్ ప్రచారం చేసే అవకాశం ఉంది.
మరోవైపు.. కేసీఆర్ తన టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చి మహారాష్ట్రలోనూ విస్తరించారు. ఆ మధ్య జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని సీట్లు కూడా కైవసం చేసుకున్నారు. అయితే.. కేసీఆర్ కూడా అక్కడి తెలుగు ప్రజలను చూసే తన పార్టీని మరింత బలోపేతం చేయాలనుకున్నారు. వచ్చే ఎన్నికల్లో మహారాష్ట్రలో సత్తాచాటాలని కలలు గన్నాడు. కానీ.. ఊహించని రీతిలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది. దాంతో బీఆర్ఎస్ పార్టీ కనీసం పోటీలో కూడా లేకుండాపోయింది. ఆ పార్టీకి చెందిన అక్కడి నేతలు కూడా రాజీనామా చేసి తప్పుకున్నారు. ఇక తెలంగాణలో విజయం సాధించిన చందంగా మహారాష్ట్రలోనూ జెండా ఎగురేయాలని కాంగ్రెస్ ప్రయత్నాలు సాగిస్తుండడంతో.. తెలంగాణ పథకాలనే అక్కడ ప్రచారం చేసేందుకు సిద్ధపడినట్లుగా తెలుస్తోంది. పదేళ్ల తరువాత తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో.. అదే స్ట్రాటజీని అక్కడా వాడాలని తాపత్రయపడుతోంది. అంతేకాకుండా తెలంగాణలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను మహారాష్ట్రలోనూ ప్రచారం వాడేలా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా రేవంత్‌ను స్టార్ క్యాంపెయినర్‌గా నియమించింది హైకమాండ్. మరోవైపు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు జార్ఖండ్ బాధ్యతలు అప్పగించారు. అక్కడ రెండు విడతల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే మొదటి విడతకు సంబంధించి ప్రచారంలో భట్టి పాల్గొంటున్నారు.
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read MoreWeb Title: He won in telangana now revanth has been brought down in maharashtra this is the plan of congress
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com