https://oktelugu.com/

భారీగా పెరిగిన బైక్ ధరలు.. ఏ బైక్ ఎంత పెరిగిందంటే..?

కొత్త ఏడాదిలో వాహనదారులకు భారీగా షాక్ తగిలింది. ప్రముఖ బైక్ కంపెనీలు బైక్ ల ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దాదాపు అన్ని కంపెనీలు ధరలను పెంచడంతో కొత్తగా బైక్ కొనుగోలు చేయాలని అనుకునే వాళ్లకు భారీ షాక్ తగిలినట్లేనని చెప్పాలి. టీవీఎస్‌, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌, బజాజ్ కంపెనీలు ధరలను పెంచాయి. ఈ ఏడాది జనవరి నుంచి తయారయ్యే బైక్ లకు కొత్త ధరలు వర్తిస్తాయి. బజాజ్‌, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కంపెనీలు అన్ని బైక్ ల […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 13, 2021 4:01 pm
    Follow us on

    కొత్త ఏడాదిలో వాహనదారులకు భారీగా షాక్ తగిలింది. ప్రముఖ బైక్ కంపెనీలు బైక్ ల ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దాదాపు అన్ని కంపెనీలు ధరలను పెంచడంతో కొత్తగా బైక్ కొనుగోలు చేయాలని అనుకునే వాళ్లకు భారీ షాక్ తగిలినట్లేనని చెప్పాలి. టీవీఎస్‌, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌, బజాజ్ కంపెనీలు ధరలను పెంచాయి. ఈ ఏడాది జనవరి నుంచి తయారయ్యే బైక్ లకు కొత్త ధరలు వర్తిస్తాయి.

    బజాజ్‌, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కంపెనీలు అన్ని బైక్ ల ధరలను పెంచగా టీవీఎస్ కంపెనీ మాత్రం అపాచీ బైక్ ధరను పెంచింది. పల్సర్ 220ఎఫ్ ధర ఏకంగా 3,500 రూపాయలు పెరిగింది. ధర పెరగడంతో ఈ బైక్ ధర ప్రస్తుతం 1,25,000 రూపాయలుగా ఉంది. ఎన్ఎస్‌ 200 ధర 3,500 రూపాయలు పెరగగా ఎన్‌ఎస్‌ 160 ధర 3,000 రూపాయలు పెరిగింది. బజాజ్ కంపెనీ అవెంజర్ క్రూయిజర్ 220 ధరలు 3,521 రూపాయలకు పెంచింది.

    ప్రముఖ బైక్ సంస్థలలో ఒకటైన రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థ ఆర్ఈ క్లాసిక్ 350 ధర 2,000 రూపాయలు పెరగడం గమనార్హం. అపాచీ ఆర్టీఆర్ 160 4వీ ధర, ఆర్డీఆర్ 180 ధర 1,770 రూపాయలు, ఆర్టీఆర్ 160 ధర 1,520 రూపాయలు పెరగడం గమనార్హం. టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 ధర 3,000 రూపాయల వరకు పెరగడం గమనార్హం. అపాచీ ఆర్టీఆర్ 200 4వీ ధర 2,000 రూపాయలు పెరగడంతో ఈ బైక్ ధర 1,33,000 రూపాయలుగా ఉంది.

    కొత్త ఏడాదిలో నిత్యావసర వస్తువులు, కార్ల ధరలు ఇప్పటికే భారీగా పెరిగాయి. బైక్ ల ధరలు కూడా పెరగడంతో కొత్తగా బైక్ లను కొనుగోలు చేసేవాళ్లకు అదనపు భారం పడనుంది.