Best Smartphones Under 20000 In India 2026: కాలం మారుతున్న కొద్ది మొబైల్ అత్యవసరంగా మారిపోతుంది. కొందరు ఉద్యోగం, వ్యాపారం చేసేందుకు ఫోన్ కీలకంగా మార్చుకుంటున్నారు. మెసేజ్ నుంచి మనీ ట్రాన్స్ఫర్ వరకు అన్ని రకాలుగా ఫోన్ ఉపయోగపడడంతో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ కనిపిస్తుంది. అయితే ప్రస్తుత కాలంలో స్మార్ట్ఫోన్ అప్డేట్ తో మార్కెట్లోకి వస్తుంది. ఈ సమయంలో వీటి ధరలు కూడా పెరుగుతున్నాయి. గతంలో రూ.10,000 వరకు వచ్చిన మొబైల్స్ ఇప్పుడు వాటి పనితీరు మెరుగుపడడంతో ధరలు కూడా పెరిగాయి. ఇప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్స్ సైతం మినిమం రూ.25,000 వెచ్చించి కొత్త ఫోన్ కొంటున్నారు. కానీ మార్కెట్లో రూ.20,000 లోపు మంచి కాన్ఫిగరేషన్ కలిగిన మొబైల్స్ అందుబాటులో ఉన్నాయి. అలాంటి వాటిలో టాప్ 5 మొబైల్స్ గురించి తెలుసుకుందాం..
Also Read: రేవంత్ రెడ్డి మూడు ముక్కలాట..!
Moto G9 6
Motorola కంపెనీకి చెందిన Moto G96 అనే మొబైల్ మిడిల్ క్లాస్ పీపుల్స్ కు అందుబాటులో ఉంది దీని ధర రూ.18,999 గా ఉంది. ఇందులో 6.7 అంగుళాల POLED డిస్ప్లే కలిగి ఉంది. ఇందులో 4 NM స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెస్ ద్వారా పనిచేస్తుంది. మల్టీ టాస్కింగ్ కోసం యూజ్ చేసే వారికి ఇది బాగా పనిచేస్తుంది. ఇందులో 5,000 mAh బ్యాటరీ ఉండనుంది. ఇది రోజంతా వినియోగించినా కూడా తగిన చార్జింగ్ను అందిస్తుంది. మెరుగైన కెమెరా పనితీరుతో ఉండే ఈ మొబైల్ అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
Moto G67 Power
Motorola కంపెనీకి చెందిన మరో మొబైల్ మోటో g6 పవర్ మొబైల్ కూడా సామాన్యులకు అందుబాటులోనే ఉంది. దీని ధర రూ.16,999 తో విక్రయిస్తున్నారు. ఇందులో స్నాప్ డ్రాగన్ 7 జెన్ 2 ప్రాసెసర్ ఉండడంతో రోజువారి వినియోగదారులకు అనుగుణంగా ఉంటుంది. గేమింగ్ కోరుకునే వారికి కూడా ఇది సపోర్ట్ గా నిలుస్తుంది. ఇందులో 7000 mAh బ్యాటరీ పవర్ ఉండడంతో చార్జింగ్ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. 128 జీబీ స్టోరేజ్ ఉండడంతో తగినంత ఫైల్స్ నిల్వ చేసుకోవచ్చు.
మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్
త్వరలో మార్కెట్లోకి రాబోతున్న మోటరోలా 60 ఫ్యూజన్ మొబైల్ ఫీచర్లు ఇప్పటికే చాలామందిని ఆకట్టుకుంటాయి. ఇందులో 1.5 కే resolution తో కూడిన POLED డిస్ప్లే ఉండనుంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. దీని ధర రూ.19,999 తో విక్రయించనున్నారు.
CMF ఫోన్ 2 ప్రో
ఈ మొబైల్ ధర రూ.18,999 తో అందుబాటులో ఉంది. ఇది 7.8 ఎంఎం స్లిమ్ డిజైన్తో ఉండడంతో ఆకాశిస్తుంది. ఇందులో 5000 mAh బ్యాటరీ ఉండడంతో రోజువారి వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే మీడియా టెక్ డైమెన్సిటీ 7300 nits తో పని చేయనుంది.
Poco m80 5G
మీ మొబైల్ చూడడానికి చాలా స్లిమ్ గా కనిపిస్తుంది. ఇందులో స్నాప్ డ్రాగన్ 6S Gen 3 ప్రాసెసర్ ఉండనుంది. దీని ధర రూ.17,999 తో విక్రయిస్తున్నారు.
,
