Best budget electric scooters: ప్రస్తుతం అంతా ఎలక్ట్రిక్ స్కూటర్లదే హవా సాగుతోంది. ఇప్పటివరకు పెట్రోల్ స్కూటర్లు లేదా బైక్ ఉన్నవారు వాటి స్థానంలో EV లు కొనుగోలు చేస్తున్నారు. అయితే చాలా కంపెనీలు వీటిని రకరకాల మోడల్స్ లో మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. కానీ కొంతమంది వినియోగదారులు వీటిని బడ్జెట్లోనే కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని తక్కువ ధరలోనే ఎలక్ట్రిక్ స్కూటర్లను అందించేందుకు కంపెనీలు ముందుకు వస్తున్నాయి. అలా తక్కువ ధరలోనే అందుబాటులో ఉండే EV లు ఏవో ఇప్పుడు చూద్దాం..
Tvs Orbiter V1:
టీవీఎస్ కంపెనీకి చెందిన ఈ స్కూటర్ లో 1.8 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది IDC రేంజ్ లో 86 కిలోమీటర్ల గరిష్ట వేగం అందించనుంది. దీనిని చార్జింగ్ చేయడానికి రెండు గంటల 20 నిమిషాలు పడుతుంది. బ్లూటూత్ కనెక్టివిటీ, లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన నావిగేషన్, ఎస్ఎంఎస్ హెచ్చరికలు వంటి ఫీచర్లు ఉన్న ఈ స్కూటర్ ధర ప్రస్తుతం మార్కెట్లో రూ.84,500 గా ఉంది. అయితే దీనిని BAS ద్వారా కొనుగోలు చేస్తే రూ.49,999 కే వస్తుంది.
Kinetic DX :
కైనెటిక్ కంపెనీకి చెందిన ఈ స్కూటర్ ను ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 102 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో టీలేస్ ఇగ్నీషియన్ మటన్ తో పనిచేసే ఈజిప్లిఫ్ వంటి టెక్నాలజీ చూడవచ్చు. సీటు కింద 37 లీటర్ల స్టోరేజ్ పొందవచ్చు. దీంతో హెల్మెట్ తో పాటు ఇతర వస్తువులను నిల్వ చేసుకోవచ్చు. ఈ స్కూటర్లో 8.8 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీనిని ప్రస్తుతం మార్కెట్లో రూ. 1.11 లక్షలతో విక్రయిస్తున్నారు. ఇందులో 2.6 కిలో వాట్ బ్యాటరీ ఉండనుంది.
Bajaj Chetak C 2501:
ఈ స్కూటర్ లో 2.5 కిలోవాట్ బ్యాటరీ ఉండనుంది. ఈ బ్యాటరీ పూర్తిగా చార్జింగ్ కావడానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. దీనిని ఒక్కసారి చార్జింగ్ చేస్తే 113 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. గంటకు 55 కిలోమీటర్ల వేగంతో వెళ్లే ఈ స్కూటర్ బాడీ మొత్తం మెటల్ తో తయారు చేయబడింది. ఫ్రంట్ సైడ్ లో కంబైన్డ్ బ్రేక్ సిస్టం వంటి ఫీచర్లు ఉన్న దీనిని ప్రస్తుతం రూ.89,500 తో విక్రయిస్తున్నారు.
TVS iQube:
టీవీఎస్ కంపెనీకి చెందిన ఈ స్కూటర్లో 4.4 కిలో వాట్ బ్యాటరీ ఉండనుంది. LED లైటింగ్ తో పాటు బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే 7 అంగుళాల TFT స్క్రీన్ ను కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఒకసారి చార్జింగ్ చేస్తే 212 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ బ్యాటరీ చార్జింగ్ కావడానికి రెండు గంటల 45 నిమిషాల సమయం పడుతుంది. ప్రస్తుతం దీనిని మార్కెట్లో రూ.94,434 ధరతో విక్రయిస్తున్నారు.