Before 31:ప్రతీ సంవత్సరం మార్చి అనగానే చాలా మంది లెక్కలు వేసుకుంటారు. ఫైనాన్సియల్ ఇయర్ మార్చి ఎండింగ్ తో పూర్తవుతుంది. ఈ తరుణంలో ఫైనాన్స్ తో ముడిపడి ఉన్న కొన్ని పనులు సైతం మార్చి తరువాత మరోలా ఉంటాయి. అయితే ఈ మార్చి 31 లోపు కొన్ని పనులు చేయకపోతే మాత్రం భారీగా నష్టపోవాల్సి వస్తుంది. గడువు దాటిన తరువాత వీటిని చేసుకున్నా ఉపయోగం లేదు. అందువల్ల వెంటనే అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. ఇంతకీ ఆ పనులు ఏంటంటే?
ఫాస్ట్ టాగ్..
టోల్ టాక్స్ ను చెల్లించడానికి ఫాస్ట్ టాగ్ ను ఉపయోగిస్తారు. అయితే మార్చి 31 వరకు ఫాస్ట్ టాగ్ ను తప్పనిసరిగా కేవైసీ చెల్లించుకోవాలని ప్రభుత్వం తెలిపింది. ఎందుకంటే ఫాస్ట్ టాగ్ లో చాలా వరకు అవకతవకలు జరిగాయి. ఒకే ఫాస్ట్ టాగ్ ను మల్టీపుల్ వాహనాలకు ఉపయోగించుకున్నట్లు బయటపడింది. అందువల్ల కేవైసీని పూర్తి చేస్తేనే ఏప్రిల్ నుంచి ఫాస్ట్ టాగ్ ద్వారా టోల్ టాక్స్ ను చెల్లించడానికి ఆస్కారంఉంటుంది.
ఫాస్ట్ టాగ్ -పేటీఎం:
చాలా మంది ఫాస్ట్ టాగ్ ను ఇప్పటి వరకు పేటీఎం ద్వారా చెల్లిస్తూ వచ్చారు. కానీ మార్చి 15 నుంచి అలా కుదరదు. ఫాస్ట్ టాగ్ ను పేటీఎం నుంచి తీసివేస్తారు. అందువల్ల వేరే బ్యాంకుతో ఫాస్ట్ టాగ్ ను లింక్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. లేకుంటే అత్యవసర సమయంలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి.
సేవింగ్స్ టాక్స్:
ప్రతీఏడాది మార్చి 31 తో ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ఏప్రిల్ నుంచి లెక్కలు మారిపోతాయి. అందువల్ల ఏదైనా టాక్స్ చెల్లించాలనుకుంటే మార్చి 31 లోపు చెల్లించడం వల్ల ఎలాంటి ఫెనాల్టీ పడదు. లేకుంటే గడువు మీరిన తరువాత అదనంగా ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. అందువల్ల కచ్చితంగా మార్చి 31లోపు ఈ పనులు చేసి ఆర్థికంగా నష్టపోకుండా జాగ్రత్త పడాలని ఆర్థిక నిపుణులు తెలుపుతున్నారు.