
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్ తీసుకున్న వాళ్లకు అదిరిపొయే శుభవార్త చెప్పింది. సామాన్యులపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపిన నేపథ్యంలో లోన్ ఈఎంఐ కట్టలేక సతమతమవుతున్న వారి కోసం ఎస్బీఐ రూ.25 కోట్ల వరకు రుణాలను రీస్ట్రక్చర్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తుండటం గమనార్హం. సాధారణ ప్రజలు, వ్యాపారులకు, ఎంఎస్ఎంఈలకు ఊరట కలిగేలా ఎస్బీఐ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
లోన్ తీసుకునే వాళ్లు సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ కు వెళ్లి రీస్ట్రక్చరింగ్ గురించి మాట్లాడొచ్చు. రిజర్వు బ్యాంక్ ఇప్పటికే లోన్ రీస్ట్రక్చరింగ్ గురించి ప్రకటన చేయగా రుణ గ్రహీతలు బ్యాంక్‌తో మాట్లాడి వారి రుణాలను రీస్ట్రక్చర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎస్బీఐతో పాటు పలు బ్యాంకులు వారి బ్యాంక్ బ్రాంచ్ కు వెళ్లి ఈ బెనిఫిట్ పొందే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే ఈ బెనిఫిట్ పొందాలని అనుకుంటారో వాళ్లు సెప్టెంబర్ 30 లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఆర్థిక ఇబ్బందులతో ఈఎంఐ కట్టలేని వాళ్లకు ఈ ఆఫర్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈఎంఐ కట్టలేకపోతే మీ బ్యాంక్ బ్రాంచుకు వెళ్లి లోన్ రీస్ట్రక్చరింగ్ గురించి మాట్లాడి దరఖాస్తు చేసుకుంటే మంచిది. పూర్తి వివరాల కొరకు బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించవచ్చు. అయితే అన్ని బ్యాంకులు ఈ సౌకర్యాన్ని కల్పించడం లేదు కాబట్టి బ్యాంకును సంప్రదించి వివరాలు తెలుసుకుంటే మంచిది.
ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఎక్కువ బ్యాంకులు లోన్ రీస్ట్రక్చరింగ్ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ప్రైవేట్ రంగ బ్యాంకులలో మాత్రం కొన్ని బ్యాంకులు మాత్రమే ఈ అవకాశం కల్పిస్తుండటం గమనార్హం.