Bank Loan Interest Rates:బ్యాంకు నుంచి రుణాలు తీసుకునేవారికి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. Reserve Bank Of India మరోసారి రెపో రేటు తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ ఏడాదిలో ఇప్పటికే మూడు సార్లు రెపో రేటు తగ్గించిన ఆర్బీఐ మరోసారి తగ్గించేందుకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటి వరకు బ్యాంకు రుణాలు తీసుకున్నవారు.. ఇక నుంచి లోన్లు తీసుకునేవారికి ఈఎంఐ తో పాటు వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంటుంది. కరోనా సమయంలో భారీగా తగ్గించిన వడ్డీ రేటును ఆ తరువాత పెంచుకుంటూ వచ్చించి. అయితే 2025లో వరుసగా నాలుగోసారి రెపో రేటు తగ్గడంపై బ్యాంకు ఖాతాదారుల్లో హర్షం వ్యక్తం అవుతుంది.
Also Read: వాహనదారులకు అలెర్ట్.. పాటించకుంటే మీ పని ఖతమే!
ప్రస్తుత కాలంలో పలు అవసరాలకు బ్యాంకు రుణం తీసుకోవడం కామన్ అయిపోయింది. కొందరు వ్యక్తిగత రుణం.. మరికొందరు గృహ నిర్మాణం కోసం బ్యాంకు లోను తీసుకుంటూ ఉంటున్నారు. అయితే ఏ బ్యాంకు అయినా ఆర్బిఐ విధించే రెపోరేట్ ప్రకారం వడ్డీ విధిస్తుంటాయి. అయితే కొన్ని బ్యాంకులు తక్కువగా.. మరికొన్ని బ్యాంకులు ఎక్కువగా వడ్డీని విధిస్తాయి. కానీ ఆర్.బి.ఐ బ్యాంకు రేపో రేటు తగ్గించినప్పుడు వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆర్బిఐ రెపో రేటు పెంచితే వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది. తాజాగా ఆర్.బి.ఐ వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకోనిందని తెలుస్తోంది.
కరోనాకాలంలో రెపో రేట్ 5.15 శాతంగా ఉండేది. ఆ తర్వాత పెరుగుతూ వచ్చింది. 2024 సంవత్సరంలో 6.50 శాతంగా రెపోరేట్ నమోదయింది. అయితే 2025 సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు మూడుసార్లు రిపోరేట్ను తగ్గించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో 25 బేసిస్ పాయింట్లు, ఏప్రిల్ లో 25 బేసిస్ పాయింట్లు, జూన్లో 50 బేసిస్ పాయింట్లు తగ్గించారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మరోసారి ఆగస్టులో 25 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read: సన్యాసులను సన్నాసులను చేసింది.. “రెచ్చగొట్టి” 102 కోట్లు వసూలు చేసింది!
ఈసారి 25 బేసిస్ పాయింట్లు తగ్గితే బ్యాంకు రెపో రేట్ 5.25 శాతానికి పడిపోనుంది. దీంతో బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే చాలామంది లోన్లు తీసుకున్న వారికి కూడా ఉపశమనం కలగనుంది. 2024వ సంవత్సరం వరకు బ్యాంకు రుణం తీసుకున్న వారికి దాదాపు 6.50% వరకు రెపోరేట్ ఉండేది. కానీ ఇప్పుడు 5.2 కు పడిపోతే వడ్డీ రేటు తక్కువై ఈఎంఐ కూడా తగ్గే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే రుణం తీసుకున్న వారు వడ్డీ రేటు తగ్గితే ఈఎంఐ కూడా తగ్గే అవకాశం ఉంది. అది వినియోగదారుల ఎంపికను బట్టి ఉంటుంది.