Monks Blackmail News: సంసార జీవితాన్ని వద్దనుకున్నారు. ఉప్పూకారాన్ని దూరం పెట్టారు. మమకారాన్ని కాదనుకున్నారు. ఒంటికి వేరే దుస్తులను ధరించి.. వారి బతుకేదో వారు బతుకుతున్నారు. దేవుడి సేవలో తరిస్తున్నారు. సంసారం వద్దని.. సన్యాసముద్దని జీవిస్తున్నారు. కానీ అలాంటి వారి జీవితంలోకి జ్యోతిలక్ష్మి లాగా వచ్చింది. కనిపించి కనిపించినట్టు.. చూపించి చూపించినట్టు రెచ్చగొట్టింది. ఇంకేముంది ఇన్నాళ్లపాటు దూరమైనది దగ్గరికి రావడంతో వారిలో ఏవో కోరికలు కలిగాయి. ఇక్కడే థ్రిల్లర్ సినిమాను మించిన ట్విస్ట్ చోటుచేసుకుంది.
బౌద్ధ సన్యాసులను లక్ష్యంగా చేసుకుని ఓ యువతి వలపు వల విసిరింది. తన చేతలతో, చూపులతో రెచ్చగొట్టింది.. దీంతో ఇన్నాళ్లపాటు స్తబ్దుగా ఉన్న వారి లో ” మగతనం” ఒక్కసారిగా బుసలు కొట్టింది. ఆడ తోడు కోసం తహతహలాడింది. వారిలో ఆత్రుతను పెంచిన ఆ యువతి అసలు కథ మొదలుపెట్టింది.. ప్రతిరోజు వారి దగ్గరికి రావడం.. రకరకాల మాటలు చెప్పడం.. రెచ్చగొట్టే చేష్టలకు పాల్పడడంతో వారు తట్టుకోలేకపోయారు. ఆ సుఖం ఎప్పుడెప్పుడా అని తాపత్రయపడ్డారు. వారి తొందరను అర్థం చేసుకున్న ఆమె మరింత ఉద్రేక పరిచింది. దీంతో తట్టుకోవడం వారి వల్లకాలేదు. ఇదే అదునుగా ఆమె తన అసలు రూపాన్ని ప్రదర్శించింది. వారితో అత్యంత సన్నిహితంగా ఉండటం మొదలుపెట్టింది. వాటన్నిటిని వీడియోలు తీసింది. ఫోటోలు కూడా తీసింది. ఆ తర్వాత వాటిని అందరికి చూపిస్తానంటూ బెదిరించడం మొదలుపెట్టింది. ఇలా తొమ్మిది మంది సన్యాసులను సన్నాసులను చేసింది. 102 కోట్లు వసూలు చేసింది.. ఆమె దెబ్బకు ఒక వ్యక్తి సన్యాసం కూడా వదిలిపెట్టాడు.
Also Read: Katchatheevu Issue: ‘కచ్చతీవు’.. ఈ శ్రీలంక దీవిపై మోడీ-స్టాలిన్ కన్ను ఎందుకు?
ఈ విషయం అక్కడ పోలీసులకు తెలిసింది.. పోలీసులు అత్యంత గోప్యంగా దర్యాప్తు మొదలు పెట్టారు. ఆమె బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేయించారు. అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు. ఈ విషయాలు బయటకు రాకుండా ఉండడానికి పోలీసులు శత విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. మిస్ గోల్ఫ్ పేరుతో ఇంకా ఎవరైనా బాధితులు ఉన్నారా.. అనే కోణంలో పోలీసులు వివరాల సేకరిస్తున్నారు..” ఈ ప్రాంతంలో బౌద్ధ సన్యాసులు ఎక్కువగా ఉంటారు. వారు ధ్యానం లోనే మునిగి తేలుతూ ఉంటారు. వాడి దగ్గర ఇంత డబ్బు ఎక్కడిది అనేది అర్థం కావడం లేదు. ఎవరైనా ఇచ్చారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాం. ఆమె 102 కోట్లు వసూలు చేయడం మాక్కూడా దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ఈ కేసు దర్యాప్తులో ఇంకా చాలా వివరాలు రాబట్టాల్సి ఉంది.. ప్రస్తుతానికి ఆమెను విచారిస్తున్నాం. బాధితుల నుంచి వివరాలు సేకరించాం. ఆమె వద్ద ఉన్న ఫోటోలను, వీడియోలను కూడా స్వాధీనం చేసుకున్నామని” పోలీసులు చెబుతున్నారు.