Bajaj Freedom CNG 125 : దాదాపు ఆరు నెలల క్రితం ప్రారంభించబడిన ద్విచక్ర వాహన విభాగంలో బజాజ్ ఫ్రీడమ్ 125 ప్రపంచంలోని మొట్టమొదటి సీఎన్జీ మోటార్‌సైకిల్. ఈ బైక్ అమ్మకాలు భారీ పెరుగుదలను చూస్తున్నాయి. ఇప్పటివరకు 40 వేలకు పైగా యూనిట్లు అమ్ముడైనట్లు కంపెనీ తెలుపుతుంది. బజాజ్ సీఎన్జీ బైక్ మంచి బుకింగ్స్ సాధించిందని బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అన్నారు. ఆగస్టులో డెలివరీలు ప్రారంభమైనప్పటి నుండి ఈ బైక్ మంచి రిటైల్ అమ్మకాలను కలిగి ఉందన్నారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రకారం.. ఇది వినియోగదారుల ఇంధన ఖర్చును ఆదా చేయడమే కాకుండా బయో ఇంధనం సహాయంతో 300+ కి.మీ.ల పరిధిని కూడా అందిస్తుందన్నారు.
బజాజ్ ఫ్రీడమ్ 125 బైక్ ఫీచర్లు
బజాజ్ ఫ్రీడమ్ బైక్ పవర్ ఫుల్ 125cc ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది మెరుగైన శక్తిని, అద్భుతమైన మైలేజీని ఇస్తుంది. దీని డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంది .. ముఖ్యంగా యువతతో పాటు కుటుంబ సభ్యులను కూడా దృష్టిలో ఉంచుకుని దీనిని కంపెనీ రూపొందించింది. ఈ బైక్‌లో డిజిటల్ డిస్ప్లే, LED లైట్లు, సౌకర్యవంతమైన సీటింగ్ వంటి అనేక మంచి ఫీచర్లను పొందుతారు. ఈ సౌకర్యవంతమైన సీటింగ్ ఇది ఒక అద్భుతమైన ఆఫ్షన్ గా కొనుగోలు దారులకు నిలుస్తుంది.
బజాజ్ ఫ్రీడమ్ బైక్ మైలేజ్
ఈ బైక్‌ను సరసమైన ధరకు విడుదల చేయడంతో దీనిని కొనుగోలు చేసేందుకు చాలా మంది ఇష్టపడుతున్నారు. ఈ బైక్ లీటరుకు 60-65 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని, ఇది ఇంధన వినియోగం పరంగా కస్టమర్లకు ఆర్థికంగా ఉపయోగపడుతుందని కంపెనీ చెబుతోంది,
బైక్ సీటింగ్ అదుర్స్
ఈ బైక్ డిజిటల్ డిస్ప్లే, LED లైట్లు, సౌకర్యవంతమైన సీటింగ్ వంటి ఫీచర్లతో అమర్చబడి ఉంది. ఇది సుదూర ప్రయాణాలకు కూడా అద్భుతమైన ఎంపికగా ఉంటుంది. ఇది పెట్రోల్ మోడ్‌లో 130 కిలోమీటర్ల పరిధిని ఇస్తుంది. ఈ రెండు ఇంధనాలు కలిపి మొత్తం 330 కిలోమీటర్ల మైలేజీని ఇస్తాయని కంపెనీ పేర్కొంది. దీనితో ఆపకుండా, తక్కువ ఇంధన వినియోగంతో ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు. సీఎన్జీ ఆఫ్షన్ కారణంగా పొదుపుగా కూడా ఉంటుంది.