Bajaj : బజాజ్ కంపెనీ కేవలం ఒక్క ఎలక్ట్రిక్ స్కూటర్‌తోనే మార్కెట్‌లో దుమ్మురేపింది. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో బజాజ్ చేతక్ ఇండియాలోనే నంబర్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్‌గా నిలిచింది. ఈ సెగ్మెంట్‌లో బజాజ్‌కు ఇప్పుడు ఏకంగా 29శాతం మార్కెట్ షేర్ ఉంది. ఇండియాలోనే అతిపెద్ద ఈవీ మార్కెట్ అయిన మహారాష్ట్రలో బజాజ్ ఏకంగా 50 శాతం మార్కెట్ షేర్‌ను సొంతం చేసుకుంది. మార్చి 2025 అమ్మకాల్లో కూడా బజాజ్ చేతక్ టాప్ పొజిషన్‌లోనే ఉంది. గత నెలలో బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్‌లో టీవీఎస్, ఓలా, ఏథర్, హీరో, ఇతర కంపెనీలకు పోటీగా నిలుస్తూ ఏకంగా 34,863 యూనిట్ల చేతక్ ఈవీలను అమ్మింది. బజాజ్ చేతక్‌ను పలు వేరియంట్లలో విక్రయిస్తోంది. టీవీఎస్, హీరో కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాయి. అయితే, ఏథర్, ఓలా మాత్రం చాలా రకాల ఎలక్ట్రిక్ స్కూటర్లను అమ్ముతున్నాయి.
Also Read : టూ-వీలర్ మార్కెట్‌లో బజాజ్ హవా.. 3 రోజుల్లో ఊహించని విక్రయాలు!
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ మొత్తం మూడు వేర్వేరు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి 3501, 3502, 3503. ఈ మూడు మోడళ్లలో రేంజ్, బ్యాటరీ ప్యాక్ ఒకేలా ఉంటాయి. కేవలం ఫీచర్లు, కలర్ ఆప్షన్లలో మాత్రమే తేడా ఉంటుంది. బజాజ్ చేతక్ వేరియంట్ చేతక్ 3502 ధర రూ.1,42,017 నుండి ప్రారంభమవుతుంది. ఇక రెండో వేరియంట్ చేతక్ 3501 ధర రూ.1,56,755. ఇక్కడ తెలిపిన ధరలు ఢిల్లీలోని ఆన్-రోడ్ ధరలు. మార్చి 2025 అమ్మకాలను పరిశీలిస్తే బజాజ్ ఆటో 34,863 యూనిట్లు, టీవీఎస్ మోటార్ కంపెనీ 30,453 యూనిట్లు, ఓలా ఎలక్ట్రిక్ 23,430 యూనిట్లు, ఏథర్ ఎనర్జీ 15,446 యూనిట్లు, హీరో మోటోకార్ప్ 7,977 యూనిట్లను విక్రయించాయి.
బజాజ్ చేతక్ 35 సిరీస్‌లో 4kW ఎలక్ట్రిక్ మోటర్ అమర్చబడి ఉంది. ఇది 20Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 3.5kWh IP67 లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ అమర్చబడి ఉంది. ఇది 153km రేంజ్‌ను అందిస్తుంది. ఈ స్కూటర్ గరిష్ట వేగం 73kmph. ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ మోడల్‌లో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్, మ్యూజిక్ కంట్రోల్, SMS, కాల్ అలర్ట్‌లతో కూడిన TFT టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. మధ్యస్థ మోడల్ 3502 వేరియంట్‌లో టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే లేదు, కానీ కలర్ TFT కన్సోల్ ఉంది. బేస్ మోడల్‌లో LCD యూనిట్ ఉంటుంది.
Also Read : 91 కిమీ మైలేజ్‌తో సంచలనం సృష్టించిన బజాజ్ ఫ్రీడమ్ 125!