Bajaj Chetak: స్కూటర్ విభాగంలో Bajaj కంపెనీ ప్రజల మనసును దోచుకుంది. ముఖ్యంగా నేటి కాలంలో ఎక్కువగా స్కూటర్లను ఆదరిస్తున్న తరుణంలో ఈ కంపెనీ నుంచి Chetak మార్కెట్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే మొదట్లో దీని ఆదరణ తక్కువగా ఉన్నప్పటికీ.. ఆ తర్వాత అమ్మకాల్లో ఊహించని అభివృద్ధి సాధిస్తుంది. ఇది మార్కెట్లోకి వచ్చిన ఆరేళ్లలో 7 లక్షలకు పైగా స్కూటర్లను విక్రయించి ప్రత్యేకత సాధించింది. ముఖ్యంగా గత రెండు సంవత్సరాల్లోనే అత్యధిక అభివృద్ధి సాధించడం విశేషం. ఈ స్కూటర్ గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..
Bajaj కంపెనీ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ ను 2020లో మార్కెట్లోకి తీసుకువచ్చారు. అయితే ఈ సమయంలో అప్పటికే మార్కెట్లో ఓలా, Ather వంటి స్కూటర్ లో అత్యధికంగా అనే అవుతున్నాయి. కొత్తలో వీటి ధాటికి తట్టుకోలేకపోయిన chetak 2025 నుంచి అమ్మకాలు జోరందుకున్నాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో ఈ స్కూటర్ అమ్మకాలు 114 శాతం వృద్ధి సాధించడం విశేషం. 2024 ఆర్థిక సంవత్సరంలో 1.11 లక్షల స్కూటర్లు విక్రయిస్తే.. 2025 లో 2.39 లక్షల యూనిట్లలో సేల్స్ చేశారు. 2026 ఆర్థిక సంవత్సరంలో 2.98 లక్షల స్కూటర్లు అమ్ముడుపోయాయి. దీంతో ఈ స్కూటర్ మొత్తం 7,27,779 యూనిట్లు విక్రయించినట్లు అయింది.
ఇప్పటివరకు ఓలా ఎలక్ట్రిక్, టీవీఎస్ మోటార్స్ మాత్రమే 7 లక్షల మార్క్ ను దాటాయి. ఇప్పుడు వాటి సరసన బజాజ్ చేతక్ చేరడం విశేషం. అంతేకాకుండా 2026 లో ప్రముఖ ఎలక్ట్రిక్ కంపెనీ Ather కంటే పై చేయి సాధించడం విశేషంగా చెప్పుకుంటున్నారు. ఈ స్కూటర్ కు ఆదరణ పెరగడానికి ఇందులో ఉండే స్పెషల్ ఫీచర్లే కారణం అని అంటున్నారు. ఇందులో C సిరీస్ పేరుతో మెరుగైన ఫీచర్లను అమర్చారు. ఈ సిరీస్ ప్రకారం గంటకు 80 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో ప్రయాణం చేయవచ్చు. దీనిని ఒక్కసారి చార్జింగ్ చేస్తే 113 నుంచి 155 కిలోమీటర్ల వరకు మైలేజ్ ను అందిస్తాయి. అంతేకాకుండా సి సిరీస్ ప్రకారం హిల్ హోల్డ్ అసిస్టు ఉండనుంది. అలాగే ఎకో, స్పోర్ట్ రైడింగ్ మోడ్స్ తో ఉండనున్నాయి.
ఫీచర్లు మాత్రమే కాకుండా ఈ స్కూటర్ ధర కూడా మిగతా వాటి కంటే తక్కువగా ఉండడంతో ప్రజల నుంచి ఆదరణ పెరిగింది. ప్రస్తుతం దీనిని రూ.96,504 నుంచి రూ.1.39 లక్షల వరకు విక్రయిస్తున్నారు.