https://oktelugu.com/

బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్లకు షాక్.. ఈ ఛార్జీలు చెల్లించాల్సిందే..?

మనలో ప్రతి ఒక్కరూ బ్యాంక్ అకౌంట్ ను కలిగి ఉంటారు. కొందరు ఒక బ్యాంక్ అకౌంట్ ను కలిగి ఉంటే మరి కొంతమంది ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లను కలిగి ఉంటారు. అయితే బ్యాంక్ అకౌంట్ ను కలిగి ఉన్నవాళ్లు బ్యాంకులకు కొన్ని ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఆ ఛార్జీల గురించి సరైన అవగాహన ఉంటే ఇబ్బంది లేదు కానీ లేకపోతే మాత్రం ఇబ్బంది పడక తప్పదు. బ్యాంకులలో తరచూ లావాదేవీలు చేసేవాళ్లు ఛార్జీల గురించి […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : May 22, 2021 / 06:10 PM IST
    Follow us on

    మనలో ప్రతి ఒక్కరూ బ్యాంక్ అకౌంట్ ను కలిగి ఉంటారు. కొందరు ఒక బ్యాంక్ అకౌంట్ ను కలిగి ఉంటే మరి కొంతమంది ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లను కలిగి ఉంటారు. అయితే బ్యాంక్ అకౌంట్ ను కలిగి ఉన్నవాళ్లు బ్యాంకులకు కొన్ని ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఆ ఛార్జీల గురించి సరైన అవగాహన ఉంటే ఇబ్బంది లేదు కానీ లేకపోతే మాత్రం ఇబ్బంది పడక తప్పదు. బ్యాంకులలో తరచూ లావాదేవీలు చేసేవాళ్లు ఛార్జీల గురించి అవగాహనను కలిగి ఉండాలి.

    బ్యాంక్‌కు వెళ్లి డబ్బులు తీసుకోవాలన్నా లేదంటే వెయ్యాలన్నా కస్టమర్లకు ఉచిత లావాదేవీల పరిమితి ఉంటుంది. ఈ పరిమితి తరువాత 150 రూపాయల వరకు ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఏటీఎం నుంచి డెబిట్ కార్డ్ సహాయంతో డబ్బులు తీసుకోవాలని అనుకుంటే ఉచిత లావాదేవీల లిమిట్ దాటిన తరువాత 25 రూపాయల వరకు ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంక్ ఖాతాలో మినిమం బ్యాలన్స్ ను కచ్చితంగా కలిగి ఉండాలి. లేకపోతే ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది.

    ఏదైనా కారణం చేత డెబిట్ కార్డును పోగొట్టుకున్నా కొత్త డెబిట్ కార్డును పొందడానికి కచ్చితంగా డబ్బులు చెల్లించాల్సిందే. కొత్త డెబిట్ కార్డు కోసం బ్యాంకును బట్టి 50 రూపాయల నుంచి 150 రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. చెక్ ద్వారా లావాదేవీలు నిర్వహించే వాళ్లు ఆ లావాదేవీల కోసం డబ్బులను చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకులకు బట్టి ఛార్జీలలో మార్పులు ఉంటాయి.

    లక్ష రూపాయల కంటే ఎక్కువ విలువ ఉన్న చెక్స్ కు కచ్చితంగా చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. లక్ష రూపాయల లోపు చెక్స్ కు మాత్రం ఎటువంటి ఛార్జీలు ఉండవు.