
దేశీయ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ ఎన్నో పాలసీలను అందిస్తుండగా ఆ పాలసీలలో ఎల్‌ఐసీ జీవన్ ఆనంద్ కూడా ఒకటనే సంగతి తెలిసిందే. ఎల్‌ఐసీ పాలసీ తీసుకునే వాళ్లలో ఎక్కువమంది ఈ పాలసీని తీసుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఈ పాలసీ తీసుకుంటే రోజుకు కేవలం 75 రూపాయలు ఆదా చేయడం ద్వారా 10 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. 18 నుంచి 55 సంవత్సరాల వయస్సు ఉన్నవాళ్లు ఈ పాలసీని తీసుకోవచ్చు.
15 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు టర్మ్ తో ఈ పాలసీని తీసుకునే అవకాశం ఉంటుంది. 18 సంవత్సరాల వయస్సు ఉన్నవాళ్లు 20 ఏళ్ల టర్మ్‌తో పాలసీని తీసుకుంటే నెలకు 2265 రూపాయల చొప్పున ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. మెచ్యూరిటీ సమయంలో ఏకంగా ఈ పాలసీ ద్వారా 10 లక్షల రూపాయలు పొందవచ్చు. పాలసీ డబ్బులు 5 లక్షల రూపాయలతో పాటు బోనస్ 4.5 లక్షల రూపాయలు మనం పొందవచ్చు.
ఎఫ్ఏబీ కింద దాదాపు 35వేల రూపాయలు లభించే అవకాశం ఉంటుంది. మొత్తంగా పాలసీదారుడు 10 లక్షల రూపాయల వరకు పొందే అవకాశం ఉంటుంది. పాలసీ టర్మ్ కాలంలో పాలసీదారుడు మరణిస్తే నామినీ ఆ డబ్బులు పొందే అవకాశం ఉంటుంది. ఎల్‌ఐసీ పాలసీ తీసుకోవాలని అనుకునే వాళ్లకు ఈ పాలసీ బెస్ట్ పాలసీ అని చెప్పవచ్చు. సమీపంలోని ఎల్‌ఐసీ బ్రాంచ్ ను సంప్రదించి ఈ పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
ప్రీమియం ఎక్కువమొత్తం చెల్లిస్తే ఎక్కువ మొత్తం బెనిఫిట్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. ఎల్‌ఐసీ ఆఫర్ చేస్తున్న పాలసీలలో ఈ పాలసీ తీసుకుంటే ఎక్కువ ప్రయోజనాలను చేకూరుతాయి.