Homeబిజినెస్Ather EL01: Ather నుంచి మిడిల్ క్లాస్ స్కూటర్.. ధర ఎంతంటే..

Ather EL01: Ather నుంచి మిడిల్ క్లాస్ స్కూటర్.. ధర ఎంతంటే..

Ather EL01: ఎలక్ట్రిక్ స్కూటర్ రంగంలో సరికొత్త ట్రెండ్ సృష్టించిన Ather కంపెనీ స్కూటర్లకు వినియోగదారుల నుంచి వపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఈ కంపెనీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ అవసరమైన మోడల్స్ ను మార్కెట్లోకి తీసుకువస్తోంది. ఇప్పటి వరకు ప్రీమియం స్కూటర్లను అందించిన ఏథర్ ఎనర్జీ ఇప్పుడు కొత్తగా లో-కాస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను అందుబాటులోకి తీసుకురానుంది. EL01 కోడ్ తో తయారవుతున్న ఈ స్కూటర్ 2026 పూర్తయ్యేనాటికి లాంచ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మిడిల్ క్లాస్ పీపుల్స్ ను లక్ష్యంగా చేసుకుని అందుబాటులోకి తీసుకువచ్చే ఈ స్కూటర్ ఎలా ఉండబోతుందో చూద్దాం..

ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీదారు ఏథర్ ఎనర్జీ తన ప్రీమియం 450 సిరీస్ తో ఆకట్టుకుంది. ఆ తరువాత Rizta మోడళ్ల ద్వారా మరింత ఆదరణ పొందుతోంది. ఇప్పుడు తన మార్కెట్‌ను విస్తరించేందుకు EL01ను అభివృద్ధి చేస్తోంది. EL అనే కొత్త మాడ్యులర్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉండే ఈ స్కూటర్, స్టీల్ యూనిబాడీ ఫ్రేమ్‌తో తక్కువ ఉత్పత్తి ఖర్చును సాధిస్తుంది.

EL01లో 2kWh నుంచి 4kWh వరకు బ్యాటరీ ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది. ఈ బ్యాటరీలు ఒక్కసారి చార్జ్‌ చేస్తే 100 నుంచి 120 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. 14 అంగుళాల ముందు, 12 అంగుళాల వెనుక వీల్స్, స్వింగ్‌ఆర్మ్ మౌంటెడ్ మోటార్, టెలిస్కోపిక్ ఫోర్క్, డిస్క్/డ్రమ్ బ్రేక్‌లు ఫీచర్లు. ఫాస్ట్ చార్జింగ్‌తో 10 నిమిషాల్లో 30 కి.మీ రేంజ్ సాధ్యమవుతుంది.

ప్లాట్ ఫ్లోర్‌బోర్డ్, రెండు హెల్మెట్లు ఫిట్ అయ్యే అండర్‌సీట్ స్టోరేజ్, అన్ని LED లైటింగ్‌తో ఫ్యామిలీకి బాగా ఉపయోగపడుతుంది. AtherStack 7.0 సాఫ్ట్‌వేర్‌తో TFT డిస్‌ప్లే, వాయిస్ ఇంటరాక్షన్ , ఇన్ఫినిట్ క్రూజ్ (అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్), OTA అప్‌డేట్లు, గూగుల్ మ్యాప్స్ వంటివి ఇందులో కనిపిస్తాయి. ఈ స్కూటర్ ధర సుమారు రూ.99,000 నుంచి రూ.1.10 లక్షల వరకు ఉండొచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఇది ఏథర్ లైనప్‌లో అతి తక్కువ ధర కలిగిన మోడల్. మహారాష్ట్రలోని శంభాజీనగర్ ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభం కానుంది, ఇది భారీ స్థాయి ఉత్పాదకతను సాధ్యం చేస్తుంది. ప్రభుత్వ సబ్సిడీలతో సహా మిడిల్ క్లాస్‌కు ఆకర్షణీయంగా ఉంటుంది.

ఓలా S1X, TVS iQube, బజాజ్ చేతక్ వంటి పోటీదారుల మధ్య EL01 బడ్జెట్ సెగ్మెంట్‌లో గేమ్ చేంజర్‌గా మారొచ్చని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. పెరుగుతున్న EV డిమాండ్, పెట్రోల్ ధరలు దీన్ని ప్రమోట్ చేస్తాయి. ఏథర్ IPO సమయంలో ఇది కంపెనీ వృద్ధికి బూస్ట్ ఇస్తుందని పేర్కొంటున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular