Income tax return filing tips: కేంద్ర ప్రవేశపెట్టే 2026 బడ్జెట్ కు ఇంకా ఒక నెల మాత్రమే సమయం ఉంది. ఈ క్రమంలో ఆదాయపు పన్ను చెల్లించేవారు అప్రమత్తంగా ఉండాలని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. వాస్తవానికి 2024 -25 ఆదాయపు పన్ను చెల్లించే వారిలో కొంతమంది తమ రిటర్న్ లు దాఖలు చేయలేదని తెలుస్తోంది. అటువంటి వారికోసం డిసెంబర్ 31వ తేదీ వరకు అవకాశం ఉంది. రివైజ్డ్, బిలేటెడ్ పన్ను రిటర్న్ లు వారు దాఖలు చేయవచ్చు. ఐటిఆర్ దాఖలు చేయడానికి సెప్టెంబర్ 16 తోనే గడువు ముగిసిపోయింది.
తప్పులు చేసి ఉంటే
పన్ను చెల్లించే క్రమంలో రిటర్న్ లు దాఖలు చేసే విషయంలో ఏవైనా తప్పులు చేస్తే.. అవి ఇప్పుడు గ్రహిస్తే.. లేకపోతే రిటర్న్ లు దాఖలు చేయకపోతే సెక్షన్ 139 (5) కింద రివైజ్డ్, బిలేటెడ్ రిటర్న్ లు సమర్పించడానికి అవకాశం ఉంది. ఆదాయం 5 లక్షల లోపు గనుక ఉండి ఉంటే వెయ్యి రూపాయలు, ఐదు లక్షల పైన ఉంటే 5000 వరకు అపరాధ రుసుము చెల్లించి, బిలేటెడ్ రిటర్న్ లు దాఖలు చేయవచ్చు. ఒకవేళ రిఫండ్ రావాల్సి ఉండి ఉంటే.. డిసెంబర్ 31 తర్వాత ఆ అవకాశాన్ని దాదాపుగా నష్టపోయినట్టే.
పన్ను చెల్లించే వ్యక్తులు ఐటిఆర్ దాఖలు చేసినప్పుడు. కొన్ని సందర్భాలలో ముఖ్యమైన సమాచారాన్ని తెలియజేయడం మర్చిపోతారు.. పొరపాట్లు కూడా చేస్తారు. అటువంటివారు తమ తప్పులను సరి చేసుకోవడానికి సవరించిన పన్ను రిటర్న్ లు దాఖలు చేయవచ్చు. విదేశాలలో ఉన్న ఆస్తులను చూపించకపోవడం.. అధికంగా రీ ఫండ్ కోరడం.. ఒకవేళ ఎక్కువగా పన్ను మినహాయింపు కోరడం… ఏదైనా మినహాయింపును మర్చిపోవడం.. టీడీఎస్ తప్పుగా నమోదు చేయడం.. వంటి వాటిల్లో రిటర్న్ లు సవరించుకోవచ్చు. బిలేటెడ్ రిటర్న్ లను కేవలం కొత్త పన్ను విధానంలో మాత్రమే సమర్పించుకోవడానికి అవకాశం ఉంటుంది.
కేవలం వ్యక్తిగత పన్నులు చెల్లించేవారు మాత్రమే కాకుండా.. కంపెనీల వార్షిక రిటర్న్ లు, ఆర్థిక నివేదికలు సమర్పించే వారికి కూడా గడువును పొడిగించారు. దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఈ ప్రకారం కంపెనీలు తమ ఫైలింగ్ లను 2026 జనవరి 31 లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ గడువు ఈనెల 31వ తేదీతోనే ముగిసిపోయింది. ఫైలింగ్ వ్యవస్థలో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో వివిధ వర్గాలు విజ్ఞప్తులు చేశాయి. ఫలితంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.