Sara Arjun Father: ఈ ఏడాది బాలీవుడ్ లోనే కాదు, ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద హైయెస్ట్ కలెక్షన్స్ ని రాబట్టిన సినిమాగా రణవీర్ సింగ్(Ranveer Singh) హీరో గా నటించిన ‘ధురంధర్'(Dhurandhar Movie) చిత్రం నిల్చింది. ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన ఈ సినిమా, ఇప్పటికీ బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో రన్ అవుతూనే ఉంది. ఊపు చూస్తుంటే మరో 400 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టేలా ఉంది. ఇంకో వంద కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను ఈ చిత్రం ఫుల్ రన్ లో రాబడితే , ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేట్ చేసిన ‘పుష్ప 2’ రికార్డు ని బద్దలు కొట్టి సరికొత్త ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుంది. ఇకపోతే ఈ సినిమాలో కథా బలం ఎంత ముఖ్యమైనదో, నటీనటుల నటన కూడా అంతే ముఖ్యమైనది.
రణవీర్ సింగ్ తో పాటు అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్ వంటి నటీనటలు తమ నటనతో ఈ చిత్రాన్ని మరో లెవెల్ కి తీసుకెళ్లారు. ముఖ్యంగా ఈ చిత్రం లో హీరోయిన్ గా నటించిన సారా అర్జున్(Sara Arjun) గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. ఈమె నటన చాలా ఆకట్టుకుంది. హీరోయిన్స్ అంటే కేవలం హీరోల పక్కన పాటల్లో డ్యాన్స్ వేయడానికి అనే విధంగానే ఈమధ్య కాలం లో దర్శకలు వ్యవహరిస్తున్నారు. అలాంటి ఈ రోజుల్లో కూడా ఈ చిత్రం లో హీరోయిన్ క్యారక్టర్ కి ప్రాముఖ్యత కలిపించాడు డైరెక్టర్ ఆదిత్య ధర్. ఇంతకీ ఈ సారా అర్జున్ ఎవరో తెలుసా?, అప్పట్లో చియాన్ విక్రమ్ హీరో గా నటించిన ‘నాన్న’ అనే సినిమా గుర్తుందా?, అందులో విక్రమ్ కి కూతురు క్యారక్టర్ చేసినది ఈమెనే. ఆ చిత్రం తో పాటు అనేక సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది.
పొన్నియన్ సెల్వన్ చిత్రం లో కూడా ఈమె అద్భుతంగా నటించింది. ఈమె తండ్రి కూడా ఒక ప్రముఖ నటుడే. అతని పేరు అర్జున్ రాజ్. తెలుగు తో పాటు, హిందీ, తమిళం మరియు ఇతర భాషల్లో ఈయన క్యారక్టర్ ఆర్టిస్టుగా ఇప్పుడు ఫుల్ బిజీ గా ఉన్నాడు. మన తెలుగులో ఇతను ‘డియర్ కామ్రేడ్’ చిత్రం లో రష్మిక ని పెంచి పోషించే క్యారక్టర్ చేసాడు. అదే విధంగా ఆనంద్ దేవరకొండ హీరో గా నటించిన ‘గం గం గణేశా’ చిత్రం లో కూడా నటించాడు. ఇక ‘రజాకార్’ చిత్రం నిజాం ప్రభువుగా కరుడుగట్టిన విలనిజాన్ని చూపించాడు. అందుకు గానూ ఆయన ఉత్తమ ప్రతినాయకుడిగా గద్దర్ అవార్డుని కూడా అందుకున్నాడు. అతని ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ లింక్ ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.
View this post on Instagram