
ఉప్పెనతో కుర్రకారుకు గిలిగింతలు పెట్టిన నటి ‘కృతిశెట్టి’. అందులో ఆమె యాక్టింగ్ కు యువత ఫిదా అయ్యారు. ఇప్పుడు టాలీవుడ్లో సంచలనం రేకెత్తిస్తున్న పేరు ‘కృతి శెట్టి.’ ఉప్పెన సినిమాలో ఈ అమ్మడి అందానికి యువత దాసోహం అవుతుండగా.. ఈ బుల్లి యాక్టింగ్ చూసిన ఆడియన్స్ అంతా.. ‘ఔరా’ అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అన్ని ఎమోషన్స్ అద్భుతంగా పలికించగల సత్తా ఉన్న కృతి కోసం ఇప్పుడు నిర్మాతలు క్యూ కడుతున్నారు. దీంతో ఈ బ్యూటీ రెమ్యునరేషన్ ఆకాశంలో గాలిపటంలా చక్కర్లు కొడుతోంది.
‘‘కృతిశెట్టి డేట్స్ కావాల్సిన వారు ముందుగానే బుక్ చేసుకోండి. ‘ఉప్పెన’ సినిమా రిలీజ్ అయితే.. ఈ అమ్మాయికి మీకు దొరక్కపోవచ్చు’’ అని ప్రీ-రిలీజ్ వేడుకలో అన్నారు చిరంజీవి. ఆయన అన్న మాటలు ఇప్పుడు అక్షరాలా నిజమవుతున్నాయి.
చూడచక్కని రూపంతో, అంతకు మించిన పెర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ మనసు దోచేస్తుండడంతో.. మేకర్స్ అంతా కృతిచుట్టూ చక్కర్లు కొడుతున్నారు. దీంతో.. ‘ఉప్పెన’ కోసం తీసుకున్న పారితోషికం ఎకాఎకిన ఎన్నో రెట్లు పెంచేసిందట.
తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ‘కృతిశెట్టి’ అందమైన తన ఫొటోలను షేర్ చేసుకుంది. ‘ఆనందాన్ని పంచుకోండి. కరోనాని కాదు’ అంటూ రెండు కొత్త ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది ‘ఉప్పెన’ భామ కృతిశెట్టి. ఆ ఫొటోలు ఇప్పుడు యువత షేర్ చేస్తూ కామెంట్ చేస్తూ తమ కలల సుందరాంగిని చూసి మురిసిపోతున్నారు.