Homeబిజినెస్Apple launches iPhone 17: ఆపిల్ నుంచి 17 సిరీస్ ఫోన్.. ధర, ఫీచర్స్ తెలిస్తే...

Apple launches iPhone 17: ఆపిల్ నుంచి 17 సిరీస్ ఫోన్.. ధర, ఫీచర్స్ తెలిస్తే వావ్ అంటారు..

Apple launches iPhone 17: పండుగల సీజన్ కావడంతో కొన్ని కంపెనీలు కొత్త వస్తువులను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. వినియోగదారులు సైతం ఈ సమయంలో కొత్త పరికరాలు కొనాలని అనుకుంటారు. ముఖ్యంగా ఫోన్ ఎక్కువగా వాడే వారు.. మార్కెట్లోకి వచ్చే కొత్త ఫోన్ల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు. వీటిలో ఐ ఫోన్ కోసం ఎదురుచూసేవారు మాత్రం.. ఎప్పుడు కొత్త ఫీచర్ తో కలిగిన మోడల్ మార్కెట్లోకి వస్తుందా? అని అనుకుంటారు. ఈ సీజన్ లో వినియోగదారులను ఆకర్షించేందుకు ఆపిల్ కంపెనీ కొత్త మొబైల్ ను మార్కెట్లోకి తీసుకురాబోతుంది. త్వరలో ఇది అమెరికాతో పాటు ఇండియన్ మార్కెట్లో సందడి చేయనుంది. మరి ఈ కొత్త ఐ ఫోన్ ఎలా ఉండబోతుంది? ఎప్పటి నుంచి దీని అమ్మకాలు ప్రారంభించనున్నారు.

ఆపిల్ కంపెనీ కొత్తగా మార్కెట్లోకి ఐఫోన్ 17 సిరీస్ ను తీసుకురాబోతుంది. ఇది మొత్త మూడు మోడల్స్ లో వినియోగదారులను అలరించనుంది. ఈ ఫోన్ డిస్ ప్లై అద్భుతంగా ఉండే అవకాశం ఉంది. 6.3 అంగుళాల డిస్ ప్లేతో సన్నని బెజెల్స్ ఉండి సిరామిక్ షీల్డ్ తో కలిగి ఉంటుంది. ఈ మొబైల్ A19 చిప్ తో పనిచేస్తుంది. ప్రతీ మొబైల్ లో కెమెరా గురించి ప్రత్యేకంగా చూస్తారు. యూత్ కు అనుగుణంగా ఈ కొత్త ఫోన్ లో డ్యూయెల్ కెమెరాను అమర్చారు. ఇవి రెండు 48 మెగా ఫిక్సల్ తో పనిచేయనున్నాయి. ఈ కెమెరా 8x జూమ్ చేసుకోవచ్చు.

సెప్టెంబర్ 12 ను ఈ ఫోన్ ఆర్డర్లకు అవకాశం ఇవ్వనుంది. ఈ ఫోన్ ను సొంతం చేసుకోవాలంటే ఈ తేదీల్లో బుక్ చేసుకుంటే.. సెప్టెంబర్ 19 నుంచి డెలివరీ చేయనున్నారు. ఈకొత్త 17 సిరీస్ 5 కలర్లలో అందుబాటులో ఉండబోతుంది. వీటిలో మిస్ట్ బ్లూ, బ్లాక్ అండ్ వైట్, లావెండర్, సేజ్ వాటిల్లో కనిపించనుంది. ఐఫోన్ 17 సిరీస్ మార్కెట్లోకి వివిధ మోడళ్లతో అందుబాటులో ఉండనున్నాయి. ఈ మొబైల్ ఫ్రారంభ ధర రూ.79,900గా ఉంది. దీని అప్ గ్రేడ్ తో ధర పెరుగుతుంది. ఈ మోడల్ Pro కావాలనుకుంటే రూ.1,29,900 చెల్లించాలి. ప్రో మాక్స్ కావాలని అనుకుంటే రూ.1,49,900 ధరగా ఉంది. అధునాతన డిజైన్ తో ఉన్న ఈ సిరీస్ వినియోగదారులను తప్పకుండా ఆకర్షిస్తోందని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు.

ధర కాస్త ఎక్కువైనప్పటికీ ఐఫోన్ ప్రియులు భారత్ లో అధికంగానే ఉన్నారు. ఆపిల్ కంపెనీ నుంచి ఏ కొత్త సిరీస్ రిలీజ్ అయినా వెంటనే దానిని దక్కించుకోవడానికి క్యూ కట్టడానికి వెనుకాడరు. అందుకు అనుగుణంగానే ఆపిల్ కంపెనీ భారత్ లో త్వరలో అడుగుపెట్టబోతుంది. ఇందులో భాగంగా తాజాగా రిలీజ్ చేసే ఈ ఫోన్ ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular