https://oktelugu.com/

Apple China: పెనుదుమారం: అమెరికాకు తెలియకుండా చైనాలో ‘యాపిల్’ 20లక్షల కోట్ల రహస్య డీల్?

Apple China: ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ దిగ్గజం ‘యాపిల్’ సంస్థ. ఈ సంస్థ నుంచి ప్రధానంగా మొబైల్ ఫోన్లు, ల్యాప్ ట్యాప్ లు, స్మార్ట్ వాచీలు, కంప్యూటర్లు ఇలా ఎన్నో ఎలక్ర్టానిక్ ఆవిష్కరణలు ప్రతీ సంవత్సరం వెలువడుతున్నాయి. వాటికోసం ప్రపంచవ్యాప్తంగా ఎగబడుతారు. అన్నింటికంటే యాపిల్ సంస్థకు అతిపెద్ద మార్కెట్ అమెరికా, చైనాలే. అమెరికా కంటే కూడా చైనాలో యాపిల్ సంస్థ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు తెగ డిమాండ్ ఉంటుంది. కోట్ల బిలియన్ డాలర్ల బిజినెస్ చైనాలో యాపిల్ […]

Written By:
  • NARESH
  • , Updated On : December 9, 2021 / 06:39 PM IST
    Follow us on

    Apple China: ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ దిగ్గజం ‘యాపిల్’ సంస్థ. ఈ సంస్థ నుంచి ప్రధానంగా మొబైల్ ఫోన్లు, ల్యాప్ ట్యాప్ లు, స్మార్ట్ వాచీలు, కంప్యూటర్లు ఇలా ఎన్నో ఎలక్ర్టానిక్ ఆవిష్కరణలు ప్రతీ సంవత్సరం వెలువడుతున్నాయి. వాటికోసం ప్రపంచవ్యాప్తంగా ఎగబడుతారు. అన్నింటికంటే యాపిల్ సంస్థకు అతిపెద్ద మార్కెట్ అమెరికా, చైనాలే. అమెరికా కంటే కూడా చైనాలో యాపిల్ సంస్థ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు తెగ డిమాండ్ ఉంటుంది. కోట్ల బిలియన్ డాలర్ల బిజినెస్ చైనాలో యాపిల్ కు జరుగుతుంది. ఇక యాపిల్ ఫోన్ల తయారీ కూడా చైనాలోనే సాగుతుంది.

    Apple China

    అయితే 2016లో చైనా విదేశీ కంపెనీలు, వారి వస్తువుల విషయంలో తీసుకున్న కఠిన ఆంక్షలతో యాపిల్ సంస్థ ఆదాయం పడిపోయింది. నియంత్రణా చర్యల పేరిట చైనా ప్రభుత్వం యాపిల్ పై కఠిన చర్యలకు దిగింది. దీంతో యాపిల్ వ్యాపారం కుదేలైంది. యాపిల్ స్టోర్, యాపిల్ పే, ఐక్లౌడ్ కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఏర్పడింది. అప్పటికే చైనాలో ఐఫోన్ విక్రయాలు దెబ్బతినడంతో యాపిల్ సీఈవో టిమ్ కుక్ అమెరికా నుంచి పలు సార్లు చైనాలోని బీజింగ్ కు వెళ్లి అక్కడి ఉన్నతాధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. రంగంలోకి దిగి చర్చలు జరిపారు.

    ఈ క్రమంలోనే తమ వ్యాపారాలు, ఫోన్ల విక్రయాలపై కఠిన ఆంక్షలు విధించవద్దని సీఈవో టిమ్ కుక్ కోరారట.. కానీ చైనాలో వ్యాపారం ద్వారా యాపిల్ భారీగా లబ్ధి పొందుతోందని.. కానీ సంస్థ మాత్రం అందుకు ప్రతిఫలంగా తమ దేశ ఆర్థిక పురోభివృద్ధికి తగిన సహకారం అందించడం లేదని టిమ్ కుక్ కు స్పష్టం చేశారట..

    ఈ క్రమంలోనే తమ వ్యాపారాలు చైనాలో సాగేందుకు ఐదేళ్లకు గాను 275 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని యాపిల్ సీఈవో టిమ్ కుక్ రహస్యంగా కుదుర్చుకున్నట్లు సమాచారం. భారత కరెన్సీలో చెప్పాలంటే దీని విలువ ఏకంగా రూ.20.75 లక్షల కోట్లు. ఇంత భారీ డీల్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? స్వయంగా టిమ్ కిక్ రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చాయి? ఇది చైనాకు ఇంచిన లాంచాలా? అన్న అనుమానాలు ఇప్పుడుకలుగుతున్నాయి.

    275 బిలియన్ డాలర్లతో చైనాలో యాపిల్ సంస్థ భారీ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందట.. ఆ దేశ తయారీ రంగానికి అత్యాధునిక సాంకేతికతను అమెరికాకు తెలియకుండా అందజేసిందట.. ఉద్యోగులకు నైపుణ్య శిక్షణను అందించాలని ఒప్పందంలో ఉందట.. యాపిల్ పరికరాలకు కావాల్సిన విడిభాగాలను చైనా సరఫరాదారుల నుంచి మరింత ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయాలని.. ఆ దేశ సాఫ్ట్ వేర్ కంపెనీలు, విశ్వవిద్యాలయాలతో కలిసి పనిచేయాలని చైనా ప్రభుత్వం పెట్టిన కండీషన్లకు యాపిల్ సాగిలపడి ఓకే చెప్పినట్టు సమాచారం.

    అంతేకాదు చైనా 13వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలైన ఐటీ, శాస్త్ర సాంకేతిక అభివృద్ధి, విద్య, పర్యావరణ పరిరక్షణకు యాపిల్ తోడ్పాటునందించాలని కండీషన్ కు ఒప్పుకుందట.. ప్రతిఫలంగానే యాపిల్ కు కావాల్సిన సహకారాన్ని చైనా ప్రభుత్వం అందించిందట..

    Also Read: గోరువెచ్చటి నీటిలో ఇంగువ కలిపి తాగితే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే?

    ఇక చైనా-జపాన్ మద్య ఉన్న వివాదాస్పద దీవులను యాపిల్ మ్యాప్స్ లో మరింత పెద్దగా చూపించాలని చైనా పెట్టిన షరతుకు యాపిల్ అంగీకరించినట్టు సమాచారం. లేకపోతే యాపిల్ వాచ్ లను అమ్మనీయమని చైనా బెదిరించిందట.. దీంతో యాపిల్ తప్పనిసరి పరిస్థితుల్లోనే వీటికి అంగీకరించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

    ఈ క్రమంలోనే యాపిల్ వ్యాపారం కూడా చైనాలో భారీగా వృద్ధి చెందింది. గత 12 నెలల వ్యవధిలో ఏకంగా 68 బిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జించింది. యాపిల్ విక్రయాల్లో ఐదో వంతు చైనాలోనే అమ్ముడవుతున్నాయట.. ఈ క్రమంలోనే అమెరికా ప్రభుత్వానికి తెలియకుండా లక్షల కోట్లను యాపిల్ సంస్థ చైనాలో కుమ్మరించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. మరి వీటిపై యాపిల్ సంస్థ మాత్రం ఇప్పటివరకూ స్పందించలేదు. ఇదిప్పుడు అమెరికా సహా ప్రపంచదేశాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. అమెరికా టెక్నాలజీతో చైనాను యాపిల్ అభివృద్ధి చేసిందని విమర్శలు వినిపిస్తున్నాయి.

    Also Read: ఈ ఏడాది గూగుల్‌లో ఎక్కువ మంది వీరి కోసమే వెతికారు..వారు ఎవరంటే?