Ivoomi S1: ఒక్కరూపాయి కూడా డౌన్ పేమేంట్ కట్టకుండా ఈ బైక్ ను తీసుకెళ్లండి.. ఏ కంపెనీదో తెలుసా?

iVoomi అనే కంపెనీ నుంచి టూవీలర్స్ చాలా వరకు వచ్చాయి. అయితే ఈమధ్య ఎక్కువ శాతం వినియోగాదారులు ఈవీల కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు. దీంతో బెస్ట్ సెల్లింగ్ స్కూటర్లపై iVoomi కంపెనీ ఆపర్లను ప్రకటించింది.

Written By: Srinivas, Updated On : October 14, 2024 6:00 pm

Ivoomi S1

Follow us on

Ivoomi S1: దేశంలో విద్యుత్ వాహనాల వినియోగం పెరిగిపోతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గకపోవడంతో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే వివిధ కంపెనీలు ఈవీ స్కూటర్లను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. అయితే వీటి ధరలు రూ.లక్షలకు పైగానే ఉన్నాయి. కొన్ని కంపెనీలు మాత్రం తక్కువ ధరతో విక్రయిస్తున్నాయి. అయితే కొందరు వీటి ధర చెల్లించే మొత్తం లేకపోవడంతో లోన్ ద్వారా ఈవీ స్కూటర్ కొనుగోలు చేయాలని చూస్తున్నారు. మిగతా స్కూటర్ల మాదిరిగానే ఈవీలకు డౌన్ పేమేంట్, ఈఎంఐ సదుపాయం ఉంటుంది. కానీ ఓ కంపెనీ తమ ఈవీ కొనుగోలు చేస్తే ఒక్క రూపాయి కూడా డౌన్ పేమెంట్ చెల్లించకుండా స్కూటర్ తీసుకెళ్లొచ్చు.. అనే ఆఫర్ ప్రకటించింది. ఇంతకీ ఆ కంపెనీ ఏదీ? ఈఎంఐ ఎంత చెల్లించాలి?

iVoomi అనే కంపెనీ నుంచి టూవీలర్స్ చాలా వరకు వచ్చాయి. అయితే ఈమధ్య ఎక్కువ శాతం వినియోగాదారులు ఈవీల కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు. దీంతో బెస్ట్ సెల్లింగ్ స్కూటర్లపై iVoomi కంపెనీ ఆపర్లను ప్రకటించింది. పండుగ సీజన్ పురస్కరించుకొని జీత్ X ZEస్కూటర్ పై రూ.10 వేల వరకు డిస్కౌంట్ ప్రకటించింది. అలాగే ఎస్ 1 సిరీస్ పై రూ.5 వేల వరకు తగ్గించి విక్రయాలు జరపనున్నారు. ఇవి పవర్ ఫుల్ టూ వీలర్స్ గా ఇప్పటికే పేరు తెచ్చుకున్నాయి. వీటిలో జీత్ X ZE ని రూ.80,000తో విక్రయిస్తున్నారు. దీనిని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 170 కిలోమీటర్ల మైలేజ్ ఇష్తుంది. ఇది నార్డో గ్రే, అల్ట్రా రెడ్, అర్బన్ గ్రీన్ వంటి మొత్తం 8 రంగుల్లో అందుబాటులో ఉంది. ఇందులో 3 కిలో వాట్ బ్యాటరీ ఉంటుంది. గంటకు 57 కిలోమీటర్ల వరకు దూసుకెళ్లే ఇది ఎక్కువగా నగరాల్లో ఉండేవారికి అనుగుణంగా ఉంటుంది.

iVoomi ఎస్ 1 సిరీస్ ధర ప్రస్తుతం మార్కెట్లో రూ.79,999తో ఉంది. ఇందులో 2.1 కిలో వాట్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. 1 పోర్టబుల్ బ్యాటరీ తో ఛార్జింగ్ చేస్తే ఫుల్ అయ్యే వరకు 5 గంటల సమయం పడుతుంది. గంటకు 58 కిలోమీటర్ల వేగంతో వెళ్లే ఈ స్కూటర్ ఒక్కసారి ఛార్జింగ్ చేసత్ే 110 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ స్కూటర్ రూ.5 వేల వరకు తగ్గింపును ప్రకటించారు. ఈ ఆఫర్ నవంబర్ వరకు ఉంటుందని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. అయితే ఎస్ 1 సిరీస్ కంటే జీత్ X ZE స్కూటర్ పై ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఇది తక్కువ సమయంలో ఛార్జింగ్ ఫుల్ కావడంతో పాటు అత్యధికంగా 170 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

అయితే ఈ రెండు స్కూటర్ల పై కంపెనీ ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ స్కూటర్లు కొనుగోలుు చేస్తే ఒక్క రూపాయి కూడా డౌన్ పేమేంట్ కట్టాల్సిన అవసరం లేదని తెలిసింది. సాధారంగా జీరో డౌన్ పేమేంట్ అంటూనే ఛార్జీల రూపంలో కొంత వసూలు చేస్తారు. కానీ ఈ స్కూటర్లపై ఒక్క రూపాయి కూడా డౌన్ పేమేంట్ కట్టాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా బైక్ ధర ఎంత ఉందో అంతే మొత్తంలో నెలనెల రూ.10వేలు చెల్లించే అవకాశం ఉంది. ఏమాత్రం ఎక్కువగా వడ్డీ కట్టాల్సిన అవసరం లేదని తెలిపింది. ఈ ఆఫర్ పండుల సందర్భంగా తీసుకొచ్చామని, కొన్ని రోజుల మాత్రమే ఈ అవకాశం ఉంటుందిన అన్నారు.