https://oktelugu.com/

Whatsapp: లైట్ లేకున్నా, రాత్రి అయినా సరే వాట్సాప్ లో వీడియో కాల్ మాట్లాడవచ్చు. ఎలా అంటారా?

వాట్సాప్‌లో లో లైట్ మోడ్‌ను ఎలా ప్రారంభించాలి: WhatsAppలో తక్కువ కాంతి మోడ్‌తో వీడియో కాల్ చేయడం చాలా సులభం అయింది. దీన్ని యాక్టివేట్ చేయడానికి ఈ కింది స్టెప్స్ ఫాలో అవ్వండి.

Written By:
  • NARESH
  • , Updated On : October 15, 2024 / 06:00 AM IST

    Whatsapp

    Follow us on

    Whatsapp: వాట్సాప్ మరో అద్భుతమైన ఫీచర్ తో వినియోగదారుల ముందుకు వచ్చింది. తక్కువ కాంతి(low light) మోడ్ లో కూడా వీడియో కాలింగ్‌ను మెరుగుపరుస్తుంది ఈ ఫీచర్. అంటే మీ ప్రియమైన వారితో కనెక్ట్ అవ్వడాన్ని సులభతరం చేస్తుంది. స్పష్టమైన, మరింత శక్తివంతమైన వీడియో అనుభవం కోసం మీరు తక్కువ వెలుతురు ఉన్న గదిలో కూడా వీడియో కాల్ ను హాయిగా ఉపయోగించుకోవచ్చు. ఈ ఫీచర్ ను మీ వాట్సాప్ లో ఎలా యాక్టివేట్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. డిమ్ లైట్ సెట్టింగ్‌లలో వీడియో నాణ్యతను మెరుగ్గా వస్తుంది . అయితే VC సమయంలో కొత్త ఫిల్టర్‌లు, బ్యాక్‌గ్రౌండ్‌ల ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు.

    ఇంతకీ ఈ లైట్ మోడ్ అంటే ఏమిటి?
    పేరుకు తగ్గట్టుగానే low light మోడ్ అంటే పరిసరాల్లో తక్కువ కాంతి ఉన్నప్పటికీ మీరు ఎటువంటి డిస్ట్రబ్ లేకుండా వీడియో కాల్ చేసి మాట్లాడవచ్చు. అందులోనూ బెస్ట్ క్వాలిటీతో మీరు వీడియో కాల్ చేసి ఎంజాయ్ చేయవచ్చు. WhatsApp వీడియో కాల్ నాణ్యతను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ ఫీచర్ తీసుకొచ్చింది సంస్థ. అయితే ఈ ఫీచర్‌ ప్రత్యేకత ఏంటి అని ఆలోచిస్తున్నారా? వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు ఆటోమెటిక్ గా మీ పరిసరాల్లో ఉన్న కాంతిని పరిశీలిస్తుంది. అంతేకాదు వీడియో కాల్ కు తగ్గట్టుగా లైట్ ను అడ్జస్ట్ చేస్తుంది. మీ ముఖానికి అదనపు వెలుతురును అందిస్తుంది. చీకటిలో వీడియో స్పష్టతను డిస్ట్రబ్ చేసే గ్రైనినెస్‌ను తగ్గిస్తుంది. లైటింగ్ పరిస్థితులతో సంబంధం లేకుండా వీడియో కాల్ లో మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు మిమ్మల్ని మెరుగ్గా మాట్లాడుకోవచ్చు.

    వాట్సాప్‌లో లో లైట్ మోడ్‌ను ఎలా ప్రారంభించాలి: WhatsAppలో తక్కువ కాంతి మోడ్‌తో వీడియో కాల్ చేయడం చాలా సులభం అయింది. దీన్ని యాక్టివేట్ చేయడానికి ఈ కింది స్టెప్స్ ఫాలో అవ్వండి.

    ముందుగా మీరు WhatsApp ఓపెన్ చేసి, వీడియో కాల్ చేయండి. మీ వీడియో ఫీడ్‌ని ఫుల్ స్క్రీన్‌ చేసుకోండి. లో-లైట్ మోడ్‌ని యాక్టివేట్ చేయాలి అనుకుంటున్నారా? అయితే రైట్ సైడ్ పైన ఉన్న ‘టార్చ్’ గుర్తును ప్రెస్ చేయాలి. తర్వాత కాంతిని అడ్జస్ట్ చేయడానికి బల్బ్ గుర్తుపై నొక్కాలి. దీంతో మీరు లైట్ మారుతున్న విషయాన్ని గుర్తిస్తుంటారు. మీకు సరిపడే కాంతి వచ్చే వరకు బల్బ్ సింబర్ పై నొక్కతూ ఉండాలి.

    గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే..`
    వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో WhatsAppలో తక్కువ లైట్ మోడ్ గురించిన కీలక వివరాలు కూడా తెలుసుకుందాం. WhatsAppలో లో లైట్ మోడ్ iOS, Android వెర్షన్‌లలో అందుబాటులోకి వచ్చింది. Windows WhatsApp యాప్‌లో ఈ ఫీచర్ అందుబాటులోకి రాలేదు. అయినప్పటికీ వినియోగదారులు ఇప్పటికీ వారి వీడియో కాల్‌ల కోసం బ్రైట్‌నెస్ స్థాయిలను సర్దుబాటు చేసుకోవచ్చు. అయితే ప్రతి కాల్‌కి తక్కువ లైట్ మోడ్‌ని యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది అని గుర్తు పెట్టుకోండి. అయితే ఈ ఫీచర్ శాశ్వతంగా ఎనేబుల్ చేసి ఉంచడానికి ఆప్షన్ లేదని సమాచారం. ఈ కొత్త తక్కువ-కాంతి మోడ్‌తో, వాట్సాప్ వినియోగదారులకు ప్రియమైన వారితో కనెక్ట్ అవ్వడం మాత్రం సులభమే అవుతుంది.