Ananth Radhika Wedding: అనంత్-రాధిక పెళ్లి: అతిథుల జాబితా ఇదే..

అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహ ఆహ్వాన పత్రికలను వేలాది మందికి పంపించారు. ముఖ్యంగా వీవీఐపీలు, వీఐపీలను ఆహ్వానించారు. ఇందులో క్రికెట్ లెజెండ్స్, బాలీవుడ్ సెలబ్రిటీలు, హాలీవుడ్, బడా రాజకీయ నాయకులు ఉన్నారు.

Written By: Neelambaram, Updated On : July 6, 2024 5:05 pm

Ananth Radhika Wedding

Follow us on

Ananth Radhika Wedding: ఆసియా శ్రీమంతుడు ముఖేష్ అంబానీ ఇంట్లో మరోసారి షెహనాయ్ కనిపించబోతోంది. చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం వజ్రాల వ్యాపారి కుమార్తె రాధికా మర్చంట్ తో జూలై 12న జరగనుంది. జూలై 3వ తేదీ నుంచి ముకేశ్ అంబానీ యంటిలియాలో పూజా కార్యక్రమంతో ప్రారంభమయ్యాయి. అదే సమయంలో వెడ్డింగ్ కార్డులు కూడా ప్రజల ఇళ్లకు చేరడం మొదలయ్యాయి. కొందరికి ముఖేష్ అంబానీనే స్వయంగా వెళ్లి వెడ్డింగ్ కార్డులు ఇచ్చి జూలై 12న జరిగే వివాహానికి ఆహ్వానించారు.

అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహ ఆహ్వాన పత్రికలను వేలాది మందికి పంపించారు. ముఖ్యంగా వీవీఐపీలు, వీఐపీలను ఆహ్వానించారు. ఇందులో క్రికెట్ లెజెండ్స్, బాలీవుడ్ సెలబ్రిటీలు, హాలీవుడ్, బడా రాజకీయ నాయకులు ఉన్నారు. అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, రణ్ బీర్ కపూర్, అలియా భట్, ఎంఎస్ ధోనీతో పాటు పలువురు ప్రముఖులు ఈ పెళ్లికి హాజరు కానున్నారు.

ముకేశ్ అంబానీ 10 జన్ పథ్ నివాసంలో ప్రతిపక్ష నేత సోనియా గాంధీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని గురువారం కలిశారు. కొద్దిసేపు నివాసంలోనే ఉన్న అంబానీ అక్కడి నుంచి వెళ్లిపోయారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ, ఆయన కుమారులు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండేను కలిసి వివాహానికి ఆహ్వానించారు. ఈ వివాహానికి మరికొంత మంది బడా రాజకీయ నాయకులను ముఖేష్ ఆహ్వానించినట్లు సమాచారం.

అనంత్-రాధిక వివాహం జరిగిన మరుసటి రోజు జూలై 13న, అంబానీ కుటుంబం ‘శుభ్ ఆశీర్వాద్’ వేడుక నిర్వహించనుంది. దీనిలో 60 మంది డ్యాన్సర్ల అద్భుతమైన ప్రదర్శన ఉంటుంది. ‘శుభ్ ఆశీర్వాద్’ వేడుక గురించి మాట్లాడుతూ, 60 మంది డ్యాన్సర్ల బృందం ‘శ్లోకం’పై ప్రదర్శన ఉంటుందని అంబానీ కుటుంబానికి సన్నిహిత వర్గాలు తెలిపాయి.

రూ. 6-7 లక్షల విలువైన వెడ్డింగ్ కార్డు!
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వెడ్డింగ్ కార్డ్ గోల్డెన్ కలర్ బాక్స్ లో ఉంటుంది. ఇది తెరిచినప్పుడు విష్ణువు చిత్రాన్ని చూపిస్తుంది. దానిని తొలగించినప్పుడు మంత్ర ట్యూన్ వినిపిస్తుంది. మరింత తెరిచినప్పుడు, ఒక వెండి పెట్టె కనిపిస్తుంది, అందులో కొన్ని బహుమతులు, ఆహ్వాన పత్రికలు ఉంటాయి. ఇందులో గణేశుడి నుంచి రాధా-కృష్ణుల వరకు బంగారం, వెండితో కూడిన చిన్న విగ్రహాలు ఉన్నాయి. ఈ కార్డు ధరను వెల్లడించలేం కానీ అంబానీ కుటుంబానికి చెందిన ఈ లగ్జరీ కార్డు విలువ రూ.6-7 లక్షల వరకు ఉండొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.