https://oktelugu.com/

Anand Mahindra: హైదరాబాద్ యువకుడి టాలెంట్ కు ఆనంద్ మహీంద్రా ఫిదా.. ఆసక్తికర వీడియో షేర్ చేసిన కార్పొరేట్ దిగ్గజం..

కార్పొరేట్ ప్రపంచానికి ఆనంద్ మహీంద్రాను కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారికి ఆనంద్ మహీంద్రా గురించి కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. తన సంస్థ ఉత్పత్తుల గురించి ప్రత్యేకంగా చెప్పే ఆనంద్.. తనకు నచ్చిన విషయాలను కూడా అదే స్థాయిలో ప్రస్తావిస్తారు..

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : October 28, 2024 / 08:51 AM IST

    Anand Mahindra

    Follow us on

    Anand Mahindra: సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉండే ఆనంద్ మహీంద్రా.. ప్రపంచం నలుమూలలో జరిగే విషయాలను, సరికొత్త ఆవిష్కరణలను వెలుగులోకి తీసుకొస్తారు. ఆ వీడియోలను, లేదా దానికి సంబంధించిన వ్యక్తులను సోషల్ మీడియా ప్రపంచానికి పరిచయం చేస్తారు. ఈ సందర్భంగా తనదైన వ్యాఖ్యానాన్ని దానికి జత చేస్తారు. ఎప్పటిలాగే ఈసారి కూడా ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ద్వారా సరి కొత్త విషయాన్ని నెటిజన్ల తో పంచుకున్నారు. హైదరాబాద్ నగరానికి చెందిన సుధాకర్ అనే వ్యక్తి కొన్ని సంవత్సరాలుగా విచిత్రమైన కార్లను తయారు చేస్తున్నాడు. వాటితో ఏకంగా మ్యూజియం ఏర్పాటు చేశాడు. రాసే పెన్ను, గీసే పెన్సిల్, వేసుకునే షూ, తుడిపే రబ్బర్, షార్ప్ నర్ ఆకారాలలో కార్లను రూపొందించాడు. అంతే కాదు గిన్నిస్ రికార్డుల్లోనూ తన పేరును లిఖించుకున్నాడు.

    ఆనంద్ దృష్టి..

    సుధాకర్ చేసిన సూక్ష్మ “కారు” రూపాలు ఆనంద్ మహీంద్రా కు తెగ నచ్చాయి. ఆ మ్యూజియం కూడా అతడిని ఆకట్టుకుంది. దీంతో ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆనంద్ పంచుకున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా దర్శనమిస్తోంది. వెరైటీగా ఉన్న కార్లను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.. ఈ వీడియోను షేర్ చేస్తూ ఆనంద్ తనదైన శైలిలో ఓ కామెంట్ జత చేశారు. ” ఈ ప్రపంచం వినూత్నంగా ఉండాలి.. అది మరింత నవ్యతను రూపొందించుకోవాలి.. అలా జరగాలంటే.. మన అభిరుచిని వ్యక్తం చేయాలి. అలాంటి వ్యక్తులు కచ్చితంగా ఉండాలి. ఈ వీడియోలో కనిపిస్తున్న వాహనం చాలా విచిత్రంగా ఉంది. ఇలాంటి వాహనాల పైన ఎవరికీ ఎలాంటి అభిరుచులు ఉన్నా వాటిని మేము సమర్థిస్తాం. నేను ఈసారి హైదరాబాద్ ఎప్పుడైనా వస్తే.. కచ్చితంగా ఇక్కడికి వెళ్లడానికి నా ప్రణాళిక రూపొందించుకుంటాను. ఇది ఆసక్తికరంగానే కాదు.. విచిత్రంగానే కాదు.. సమ్మోహనానికి గురి చేసే ప్రయత్నం ఇది. ఎంతో అభిరుచి ఉంటే తప్ప ఇలాంటి పనులు చేయలేం. మన చుట్టూ ఇలాంటి వ్యక్తులు చాలా మంది ఉంటారు..కానీ వారు వెలుగులోకి రావడం అత్యంత అరదు. అందుకే అలాంటివారి ప్రతిభను మిగతా ప్రపంచానికి చూపించాలనదే నా తాపత్రయం.. ఇలాంటి ఆవిష్కరణలు మరిన్ని రావాలి. అప్పుడే దేశం మరింత అభివృద్ధి చెందుతుంది. ” ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యానించారు. కాగా, ఈ వీడియో ఇప్పటికే లక్షల్లో వీక్షణలను సొంతం చేసుకుంది. ” వీడియో చాలా బాగుంది. కార్ల నమూనాలు ఇంకా బాగున్నాయి. మీరు వీడియో షేర్ చేసినందుకు ధన్యవాదాలు ఆనంద్ జీ” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.