Anand Mahindra : వేల కోట్లకు అధిపతి అయినప్పటికీ ఆనంద్ మహీంద్రా ఏ మాత్రం వీలు చిక్కినా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. ఆదివారం అయితే.. సండే స్పెషల్ అని పేరుతో… సోమవారం అయితే మండే మోటివేషన్ అనే పేరుతో వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. ఆ రోజుల్లో మాత్రమే కాకుండా సమయం కుదిరినప్పుడల్లా ఏదో ఒక వీడియో లేదా ఫోటో ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేస్తుంటారు. ఇక సోమవారం కూడా మండే మోటివేషన్ పేరుతో ఆనంద్ ఒక పూర్తివంతమైన వీడియో పోస్ట్ చేశారు. ఇది జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నది. నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
ఆనంద్ పోస్ట్ చేసిన వీడియోలో కొన్ని గొర్రెలు ర్యాంప్ పై నిలబడ్డాయి. కొన్ని గొర్రెలు ఎటు వెళ్లాలో తెలియక అలాగే నిలబడిపోయాయి. దీంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు బారులు తీరడంతో ఎటు వెళ్ళాలో తెలియక వాహనదారులు హారన్స్ కొడుతున్నారు. ఈ క్రమంలో ఆ పరిస్థితిని చూసిన ఒక్క శునకం అత్యంత తెలివిగా ఆ సమస్యకు పరిష్కార మార్గం కనుగొంది. ముందుగా అది గొర్రెలపై నుంచి దూకుతూ లైన్ ముందుకు వెళ్ళింది. అక్కడినుంచి అది ఆ గొర్రెలకు దారి చూపింది. దీంతో అవి ఆ శునకాన్ని అనుసరించాయి. అలా ఆ ర్యాంప్ పై చూస్తుండగానే ట్రాఫిక్ సమస్య పరిష్కారమైంది. ఆ వాహనదారులకు ముందుకు వెళ్ళడానికి అవకాశం దక్కింది.
ఈ వీడియోను తన ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. “మనం కొత్తదారి ఏర్పరచుకొని ముందుకు సాగాలి. అప్పుడే జనాలు వారంతట వారు మనలను అనుసరిస్తారు. ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఎవరినీ అనుసరించాల్సిన అవసరం లేదని” ఆనంద్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నది. ఈ వీడియోతో చాలా మంది ఏకీభవిస్తున్నారు. సమస్య ఉన్నప్పుడు.. కొత్త ఆలోచన చేయాలని.. దానికి అప్పుడే పరిష్కార మార్గం లభిస్తుందని అనేకమంది అభిప్రాయపడ్డారు. దారి తెలియక ఇబ్బంది పడుతున్న వారికి పరిష్కార మార్గం చూపించడమే నాయకత్వ లక్షణం అని పేర్కొంటున్నారు.
Make your own way…
The others will follow you. #MondayMotivation
— anand mahindra (@anandmahindra) March 18, 2024