https://oktelugu.com/

అమెజాన్ కస్టమర్లకు బంపర్ ఆఫర్.. వాటిపై 40 శాతం డిస్కౌంట్..?

ప్రముఖ ఈకామర్స్ సంస్థలలో ఒకటైన అమెజాన్ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. కొత్త సంవత్సరం సందర్భంగా మరో సేల్ ను కస్టమర్ల కోసం తెచ్చింది. మెగా శాలరీ డేస్ పేరుతో అమెజాన్ ఈ సేల్ ను నిర్వహిస్తోంది. జనవరి 1వ తేదీ నుంచి జనవరి 3వ తేదీ వరకు ఈ సేల్ జరగనుండగా ఈ సేల్ లో భాగంగా కస్టమర్లకు అమెజాన్ ఉత్పత్తుల కొనుగోలుపై భారీ డిస్కౌంట్ లను ఇస్తున్నట్టు తెలుస్తోంది. Also Read: అమెజాన్ కస్టమర్లకు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 30, 2020 / 08:22 AM IST
    Follow us on


    ప్రముఖ ఈకామర్స్ సంస్థలలో ఒకటైన అమెజాన్ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. కొత్త సంవత్సరం సందర్భంగా మరో సేల్ ను కస్టమర్ల కోసం తెచ్చింది. మెగా శాలరీ డేస్ పేరుతో అమెజాన్ ఈ సేల్ ను నిర్వహిస్తోంది. జనవరి 1వ తేదీ నుంచి జనవరి 3వ తేదీ వరకు ఈ సేల్ జరగనుండగా ఈ సేల్ లో భాగంగా కస్టమర్లకు అమెజాన్ ఉత్పత్తుల కొనుగోలుపై భారీ డిస్కౌంట్ లను ఇస్తున్నట్టు తెలుస్తోంది.

    Also Read: అమెజాన్ కస్టమర్లకు అలర్ట్.. ఈ తప్పు చేస్తే ఖాతా ఖాళీ..?

    ప్రతి సేల్ లో ఏదో ఒక బ్యాంక్ కస్టమర్లకు అదనపు ప్రయోజనాలను కల్పించే అమెజాన్ ఈ సేల్ లో బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లు అదనపు ప్రయోజనాలను పొందే అవకాశం కల్పిస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డును వినియోగించే కస్టమర్లు 10 శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ ను పొందవచ్చు. క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ఆప్ష‌న్‌ ను వినియోగించే కస్టమర్లు సైతం డిస్కౌంట్ ను పొందే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.

    Also Read: బ్యాంక్ ఆఫ్ బరోడా బంపర్ ఆఫర్.. అరగంటలో తక్కువ వడ్డీతో రుణం తీసుకునే ఛాన్స్..?

    అమెజాన్ ఈ సేల్ లో ప్రధానంగా టీవీలు, గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్ ను ఇవ్వనుందని తెలుస్తోంది. బొమ్మలు, ఫర్నిఛర్, ఆట ఉత్పత్తులపై కూడా డిస్కౌంట్ ను పొందవచ్చని తెలుస్తోంది. అమెజాన్ సంస్థ బ్రాండ్ ను బట్టి డిస్కౌంట్లను ఇస్తోందని సమాచారం. ఇతర కామర్స్ సంస్థలతో పోలిస్తే ఎక్కువగా సేల్స్ ను నిర్వహిస్తూ అమెజాన్ కస్టమర్లకు మరింత చేరువ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది.

    మరిన్ని వార్తల కోసం ప్రత్యేకం

    ఐఎఫ్‌బీ, గోద్రేజ్, శ్యామ్‌సంగ్‌, ఎల్‌జీ, వ‌ర్ల్‌పూల్‌ లాంటి ప్రముఖ కంపెనీల ఉత్పత్తులపై భారీగా డిస్కౌంట్లు ఉండనున్నాయని తెలుస్తోంది. పెద్ద ఉప‌క‌ర‌ణాల‌పై అమెజాన్ ఏకంగా 40 శాతం డిస్కౌంట్ ఇవ్వనుందని తెలుస్తోంది. అమెజాన్ వెబ్ సైట్ ద్వారా ఈ సేల్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.