దేశంలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే చాలామంది వేర్వేరు కారణాల వల్ల రాత్రుళ్లు ఆలస్యంగా డిన్నర్ చేస్తున్నారు. ఉరుకులపరుగుల జీవితం వల్ల కొంతమంది డిన్నర్ చేయకుండానే రాత్రుళ్లు నిద్రపోతున్నారు. అయితే సరైన సమయానికి డిన్నర్ చేయకపోయినా, అస్సలు తినకపోయినా ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. రోజూ నిద్రపోయే సమయం కంటే రెండు గంటల ముందు డిన్నర్ చేస్తే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Also Read: వినాయకుడికి నెయ్యి తో కలిపిన సింధూరం దిద్దితే ఏమవుతుందో తెలుసా?
రాత్రి వేళల్లో త్వరగా డిన్నర్ చేస్తేనే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. డిన్నర్ విషయంలో రోజూ ఒకే టైమ్ లో తింటే మంచిదని.. ఒక్కోరోజు ఒక్కో సమయానికి డిన్నర్ చేస్తే బరువుపై ఆ ప్రభావం పడుతుంది. పడుకునే సమయాన్ని బట్టి ప్రతి ఒక్కరూ వాళ్లు డిన్నర్ చేసే టైమ్ ను ప్లాన్ చేసుకోవాలి. ప్రతిరోజు ఎన్ని పనులు ఉన్నా డిన్నర్ విషయంలో సమయపాలన పాటించాలి. ఏదైనా కారణాల వల్ల ఆలస్యంగా డిన్నర్ చేయాల్సి వస్తే తక్కువగా ఫుడ్ తీసుకోవడం మంచిది.
Also Read: అమెజాన్ కస్టమర్లకు బంపర్ ఆఫర్.. వాటిపై 40 శాతం డిస్కౌంట్..?
బరువు తగ్గాలనే ప్రయత్నం చేసేవారు రాత్రి 8 గంటల లోపే డిన్నర్ చేస్తే మంచిది. ఆలస్యంగా డిన్నర్ చేస్తే మాత్రం బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రోజూ తినే సమయంలో ఆలస్యంగా డిన్నర్ చేస్తే శరీరంలో కొవ్వు రెట్టింపు అవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆలస్యంగా శరీరానికి కేలరీలు అందితే శరీరం ఆ కేలరీలను ఫ్యాట్ మార్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి త్వరలో డిన్నర్ తినడం మంచిది.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
రోజూ ఆలస్యంగా ఆహారం తీసుకునే వారు గుండె సంబంధిత వ్యాధులతో బాధ పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు చెబుతున్నారు. రాత్రి సమయంలో ఎక్కువ కేలరీలు తీసుకుంటే గుండె బలహీనపడుతుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. డిన్నర్ విషయంలో టైమింగ్స్ ను తప్పనిసరిగా పాటించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.