Amazing recharge plan : నేటి కాలంలో మొబైల్ రీఛార్జ్ తడిసి మోపెడవుతుంది. మొదట్లో తక్కువ ధరలో అందించిన టెలికాం సంస్థలు.. ఇప్పుడు కాలాన్ని బట్టి ధరలు పెంచుతూ ఉన్నాయి. అయితే ప్రత్యామ్నాయం లేకపోవడంతో వినియోగదారులు ఎక్కువ ధరను చెల్లించాల్సి వస్తుంది. కానీ ఇదే సమయంలో BSNL సంస్థ మొబైల్ వినియోగదారులకు తీపి కబురును అందించింది. ఇప్పటికే 5G టవర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు 90000 ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. త్వరలో 5g సేవలు అందుబాటులోకి తీసుకురాలినట్లు తెలిపింది. అయితే ప్రస్తుతం 4g డేటాను తక్కువ ధరకు అందించేందుకు కొత్త ప్లాన్ తీసుకొచ్చింది. అయితే ఈ ప్లాన్ జూలై 1తో ముగియనుంది. ఈ ప్లాన్ ఏ విధంగా ఉందంటే?
మొబైల్ లో ఉన్న ప్రతి ఒక్కరు 4g తోపాటు 5g నెట్వర్క్ ను కలిగి ఉన్నారు. అయితే 4g ఉన్న వారి కోసం బిఎస్ఎన్ఎల్ కొత్త ఆఫర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. రూ.400 చెల్లిస్తే 400 GBని పొందవచ్చు. అంటే ఒక రూపాయికి ఒక GB అన్నమాట. ఈ ప్లాన్ వాలిడిటీ 40 రోజులపాటు వర్తిస్తుంది. అయితే ఈ ప్లాన్ లో భాగంగా కేవలం డేటా మాత్రమే వస్తుంది. కాల్స్, ఎస్ఎంఎస్ వర్తించవు. వీటి కోసం అదనంగా రీఛార్జ్ చేసుకోవాలి. కేవలం డాటా యూస్ చేసేవారికి ఈ ప్లాన్ అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ఇది జులై ఒకటి తో ముగియనుంది. ఆ తర్వాత ఇది అందుబాటులో ఉండదు. వినియోగదారులను ఆకర్షించేందుకు ఈ డాటాను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు బిఎస్ఎన్ఎల్ అధికారులు తెలిపారు.
Also Read: నితిన్ ఎదగలేదు సరే.. 20 ఏళ్లలో నువ్వు ఎంత ఎదిగావు దిల్ రాజ్ సార్..?
ప్రస్తుతం జియో, ఎయిర్టెల్ వంటి టెలికాం సంస్థలు కూడా డేటా ప్రత్యేకంగా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. కానీ బిఎస్ఎన్ఎల్ తక్కువ ధరకే అందించాలని కొత్త ప్లాన్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. అంతేకాకుండా త్వరలో 5జి అందుబాటులోకి వస్తే మరింత తక్కువకే రీఛార్జ్ ప్లాన్ ఉంటాయని తెలిపింది. గతంలో తక్కువ ధరకు రీఛార్జ్ ప్లాన్లు అందుబాటులో ఉన్న నెట్వర్క్ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ ముందుగా 5జి నెట్వర్క్ లను ఏర్పాటు చేసిన తర్వాతే రీఛార్జి ప్లాన్లను అందుబాటులోకి తీసుకురావాలని అనుకుంటుంది. ఇందులో భాగంగా ఇప్పటికే 90000 టవర్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మరిన్ని టవర్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఫైవ్ జి ప్లాన్ లను ప్రకటించనున్నారు.
మిగతా సంస్థల కంటే బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్ తక్కువగా ఉంటుందని కొందరు అనుకుంటున్నారు. అయితే నెట్వర్క్ సమస్య లేకపోతే ఇలాంటి ఇబ్బంది ఉండదని అంటున్నారు. నెట్వర్క్ సమస్య ఉంటే బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్ ల గురించి ఆలోచించరని తెలుపుతున్నారు. ఇటీవల చాలామంది ఇతర టెలికాం సంస్థల రీఛార్జ్ ప్లాన్లు ఎక్కువగా కావడంతో బిఎస్ఎన్ఎల్ కు చాలామంది మారిన విషయం తెలిసిందే. అయితే వీరు ఎప్పటికీ ఈ సర్వీస్ కే అనుకూలంగా ఉంటే ఎలాంటి సమస్య ఉండదు.