IPL auction 2026: అంతర్జాతీయ క్రికెట్లో ఆస్ట్రేలియా క్రికెటర్లు అద్భుతమైన ప్రతిభ చూపిస్తారు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతారు.. ఫార్మాట్ తో సంబంధం లేకుండా పరుగుల వరద పారిస్తారు. వికెట్లను కూడా అదే స్థాయిలో దక్కించుకుంటారు. అందువల్లే ఆస్ట్రేలియా క్రీడాకారులకు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. కేవలం ఐసీసీ నిర్వహించే టోర్నీలు మాత్రమే కాదు.. బీసీసీఐ నిర్వహించే ఐపిఎల్ లాంటి కాసుల క్రీడలో కూడా ఆస్ట్రేలియా ప్లేయర్లకు విపరీతమైన గిరాకీ ఉంటుంది.
అబుదాబి(Abu Dhabi) వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మినీ వేలం(IPL mini auction 2026)లో ఆస్ట్రేలియా(Australia) ఆటగాడు కామెరున్ గ్రీన్ (Cameron green) సరికొత్త రికార్డు సృష్టించాడు. అతడి కనీస ధర రెండు కోట్లు ఉండగా.. అతడిని సొంతం చేసుకోవడానికి కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata knight riders), రాజస్థాన్ రాయల్స్ (Rajasthan royals) విపరీతంగా పోటీపడ్డాయి.. మధ్యలోకి చెన్నై సూపర్ కింగ్స్ (Chennai super Kings) కూడా వచ్చింది. అయితే చివరికి గ్రీన్ ను కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata knight riders) 25. 20 కోట్లకు దక్కించుకుంది. ఐపీఎల్ లో హైయెస్ట్ ధర పలికిన ఫారిన్ ప్లేయర్ గా గ్రీన్ రికార్డు సృష్టించాడు.
2024 సంవత్సరంలో మిచెల్ స్టార్క్ ను కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు యాజమాన్యం 24.75 కోట్లు వెచ్చించి దక్కించుకుంది. ఆ రికార్డును ఇప్పుడు గ్రీన్ బద్దలు కొట్టాడు.. ఓవరాల్గా ఐపీఎల్ చరిత్రలో కామెరున్ గ్రీన్ మూడవ అత్యధిక ధర సొంతం చేసుకున్నాడు. రిషబ్ పంత్ 27 కోట్లకు (Lucknow) లక్నో జట్టు సొంతం చేసుకుంది. అయ్యర్ ను 26.75 కోట్లకు పంజాబ్ జట్టు దక్కించుకుంది. వీరిద్దరూ ఇప్పటివరకు తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు.. ఇక ప్రస్తుత వేలంలో సౌత్ ఆఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్ ను ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. అతని కనిస ధర రెండు కోట్లకు ఆ జట్టు దక్కించుకుంది. న్యూజిలాండ్ బెటర్ డేవాన్ కాన్వే(కనీస ధర రెండు కోట్లు), ఆస్ట్రేలియా బ్యాటర్ మెక్ గుర్క్(కనీస ధర రెండు కోట్లు), పృథ్వీ షా, సర్ప రాజ్ ఖాన్(ఇండియన్ ప్లేయర్లు) ను ఏ జట్టూ కొనుగోలు చేయలేదు.