EPFO Rules: దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలలో ఉద్యోగం చేసే ఉద్యోగులకు పీఎఫ్ ఖాతా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పీఎఫ్ అకౌంట్ కు సంబంధించిన సేవలను అందించడం జరుగుతుంది. పీఎఫ్ అకౌంట్ ను కలిగి ఉన్నవాళ్లకు వేతనంలో కొంత మొత్తం పీఎఫ్ ఖాతాలోకి వెళుతుంది. ఉద్యోగి యొక్క బేసిక్ శాలరీ, డీఏలో ఏకంగా 12 శాతం ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో జమవుతుంది.
అదే సమయంలో పని చేస్తున్న కంపెనీలు సైతం ఇంతే మొత్తాన్ని ఉద్యోగి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. అయితే ఎవరైతే పీఎఫ్ అకౌంట్ ను కలిగి ఉంటారో వాళ్లు ఈపీఎఫ్‌వో నిబంధనల గురించి కనీస అవగాహనను కలిగి ఉండాలి. లేదంటే మాత్రం ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగి జాబ్ మారిన సమయంలో కొత్త కంపెనీకి పాత పీఎఫ్ ఖాతాను బదిలీ చేసుకోవాలి.
Also Read: స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. భారీ వేతనంతో?
అయితే పీఎఫ్ ఖాతా కలిగి ఉన్నవాళ్లు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మూడు సంవత్సరాల పాటు పీఎఫ్ అకౌంట్ లో ఎటువంటి లావాదేవీలు జరగని పక్షంలో పీఎఫ్ అకౌంట్ ఇన్ యాక్టివ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. పీఎఫ్ అకౌంట్ ను కలిగి ఉన్నవాళ్లు మరణించినా కూడా పీఎఫ్ ఖాతా ఇన్ యాక్టివ్ అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు. పీఎఫ్ ఖాతాదారులు ఇతర దేశాలకు వెళ్లినా ఖాతా ఇన్ యాక్టివ్ అవుతుంది.
ఉద్యోగులు పీఎఫ్ ఖాతా నుంచి మొత్తం డబ్బులను విత్ డ్రా చేసుకున్నా కూడా ఖాతా ఇన్ యాక్టివ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. పీఎఫ్ ఖాతాలోని డబ్బులకు ఏడేళ్లలో ఎలాంటి క్లెయిమ్ రాకపోతే ఆ మొత్తం సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ ఫండ్‌లోకి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. పీఎఫ్ ఖాతాదారులు నామినీ వివరాలను యాడ్ చేయడం ద్వారా ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
Also Read: రైతులకు కేంద్రం శుభవార్త.. ఖాతాలో రూ.2,000 జమయ్యేది ఎప్పుడంటే?