https://oktelugu.com/

Actor Nani: హీరో నాని సంచలన నిర్ణయం… ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Actor Nani: తనదైన సహజ నటనతో అభిమానుల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకుంటున్నాడు నాని. విభిన్న పాత్రలు, వైవిధ్య కధాంశాలతో ప్రేక్షకులను అలరిస్తూ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు అని చెప్పాలి. ప్రస్తుతం నాని ” శ్యామ్ సింగ రాయ్ ” అనే సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి “టాక్సీవాలా” దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం చేస్తున్నాడు. కలకత్తా బ్యాక్ డ్రాప్ లో పిరియడికల్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ మూవీలో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 23, 2021 / 04:08 PM IST
    Follow us on

    Actor Nani: తనదైన సహజ నటనతో అభిమానుల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకుంటున్నాడు నాని. విభిన్న పాత్రలు, వైవిధ్య కధాంశాలతో ప్రేక్షకులను అలరిస్తూ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు అని చెప్పాలి. ప్రస్తుతం నాని ” శ్యామ్ సింగ రాయ్ ” అనే సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి “టాక్సీవాలా” దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం చేస్తున్నాడు. కలకత్తా బ్యాక్ డ్రాప్ లో పిరియడికల్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ మూవీలో నాని సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా చేస్తున్నారు. కాగా ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో డిసెంబర్ 24న విడుదల కానుంది.

    ఈ మేరకు మూవీ ప్రమోషన్లలో భాగంగా నాని ఈరోజు మీడియా సమావేశం నిర్వహించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం పై ఓ రేంజ్ లో రెచ్చి పోయారు. ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలను తగ్గించి ప్రేక్షకులను అవమానించిందని… 10 మందికి ఉద్యోగం ఇచ్చే థియేటర్ కంటే పక్కనే ఉన్న కిరాణ కొట్టు కలెక్షన్ ఎక్కువగా ఉంటుందని చురకలు అంటించారు. అలానే ఈ మేరకు ఓ సంచలన నిర్ణయం కూడా తీసుకున్నారు. తన పేరు ముందు ఉన్న నేచురల్ స్టార్ అనే ట్యాగ్ ని తీసేద్దామనుకుంటున్నానని ప్రకటించారు. ఇక తనను నేచురల్ స్టార్ అని ఎవరూ పిలవద్దని కోరారు. ప్రేక్షకులకు సినిమా చూపించడమే తమ లక్ష్యమని, లెక్కలు తర్వాత చూసుకుందామని నాని వెల్లడించారు. ఇక నాని సినిమా థియేటర్లపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమరాన్నే రేపుతున్నాయి.