Airtel: ఎయిర్ టెల్ కస్టమర్లకు షాకింగ్ న్యూస్.. ప్రీపెయిడ్ రీఛార్జ్ ల పెంపు?

Airtel: ప్రముఖ టెలీకాం కంపెనీలలో ఒకటైన ఎయిర్ టెల్ కస్టమర్లకు షాకింగ్ న్యూస్ చెప్పింది. ప్రీపెయిడ్ రీఛార్జ్ లను పెంచుతున్నట్టు ఎయిర్ టెల్ ప్రకటించింది. అపరిమిత ఉచిత వాయిస్ కాల్ ప్లాన్లపై 25 శాతం, ప్రవేశ టారిఫ్ వాయిస్ ప్లాన్లపై 20 శాతం పెంచుతున్నట్టు ఎయిర్ టెల్ ప్రకటించింది. నవంబర్ 26వ తేదీ నుంచి పెరిగిన ఛార్జీలు అమలులోకి రానున్నాయని సమాచారం అందుతోంది. ఒక్కో వినియోగదారుడిపై సగటు ఆదాయాన్ని 200 రూపాయల నుంచి 300 రూపాయలకు పెంచాలని […]

Written By: Kusuma Aggunna, Updated On : November 24, 2021 3:57 pm
Follow us on

Airtel: ప్రముఖ టెలీకాం కంపెనీలలో ఒకటైన ఎయిర్ టెల్ కస్టమర్లకు షాకింగ్ న్యూస్ చెప్పింది. ప్రీపెయిడ్ రీఛార్జ్ లను పెంచుతున్నట్టు ఎయిర్ టెల్ ప్రకటించింది. అపరిమిత ఉచిత వాయిస్ కాల్ ప్లాన్లపై 25 శాతం, ప్రవేశ టారిఫ్ వాయిస్ ప్లాన్లపై 20 శాతం పెంచుతున్నట్టు ఎయిర్ టెల్ ప్రకటించింది. నవంబర్ 26వ తేదీ నుంచి పెరిగిన ఛార్జీలు అమలులోకి రానున్నాయని సమాచారం అందుతోంది. ఒక్కో వినియోగదారుడిపై సగటు ఆదాయాన్ని 200 రూపాయల నుంచి 300 రూపాయలకు పెంచాలని ఎయిర్ టెల్ భావిస్తోంది.

Also Read: ఎయిర్ టెల్ వినియోగదారులకు షాక్.. మోత మోగించింది..చార్జీలు ఎంత పెరిగాయంటే?

Airtel

ఈ విధంగా చేయడం ద్వారా సహేతుకమైన రాబడి వస్తుందని ఎయిర్ టెల్ చెబుతోంది. టారిఫ్ రేట్ల పెంపు వల్ల ఆరోగ్యకరమైన వ్యాపార నమూనాకు దారి తీస్తుందని ఎయిర్ టెల్ చెబుతోంది. ఆదాయం పెరిగితే స్పెక్ట్రంల కొనుగోలు, నెట్వర్క్ ల విషయంలో పెట్టుబడులు పెరుగుతాయని ఎయిర్ టెల్ పేర్కొంది. ఆదాయం పెరిగితే 5జీ అమలు కూడా సులభంగా జరుగుతుందని ఎయిర్ టెల్ వెల్లడించడం గమనార్హం.

ఈరీజన్స్ వల్లే టారిఫ్ ఛార్జీల విషయంలో మార్పులు చేశామని ఎయిర్ టెల్ తెలిపింది. భారత్ లో 5జీ అమలుకు కూడా ఇది దోహదం చేస్తుందని ఎయిర్ టెల్ వెల్లడించింది. ఈ పెంపు వల్ల 28 రోజుల కాలపరిమితితో ఉన్న 79 రూపాయల ప్లాన్ ధర 99 రూపాయలుగా మారింది. 149 రూపాయల ప్లాన్ 179 రూపాయలకు, 219 రూపాయల ప్లాన్ 265 రూపాయలకు, 249 రూపాయల ప్లాన్ 299 రూపాయలకు మారింది.

298 రూపాయల ప్లాన్ 359 రూపాయలకు, 399 రూపాయల ప్లాన్ 479 రూపాయలకు, 449 రూపాయల ప్లాన్ 549 రూపాయలకు మారినట్టు సమాచారం. 379 రూపాయల ప్లాన్ 455 రూపాయలకు, 598 రూపాయల ప్లాన్ 719 రూపాయలకు, 698 రూపాయల ప్లాన్ 839 రూపాయలకు మారిందని తెలుస్తోంది.

Also Read: ఫోన్ పట్టుకుంటే షాక్ యే ఇక.. ఎయిర్ టెల్ బాటలోనే వోడాఫోన్, ఐడియా రేట్లు భగ్గు