Airtel: దేశంలోని రెండు పెద్ద ప్రైవేటు టెలికం సంస్థలు జీయో, ఎయిర్‌టెల్ కస్టమర్లకు షాక్ ఇచ్చాయి. కొన్నాళ్లుగా తక్కువ టారిఫ్‌లతో కస్టమర్లను ఆకట్టుకున్న సంస్థలు ఇప్పుడు చార్జీల మోతతో బెంబేలెత్తిస్తున్నాయి. 24 గంటల వ్యవధిలో రెండు సంస్థలు పోటీ పడి టారిఫ్ చార్జీలను భారీగా పెంచేశాయి. దీంతో వినియోగదారులపై అదనపు భారం పడనుంది. జియో సంస్థ 12 నుంచి 27 శాతం వరకు టారిఫ్ చార్జీలు పెంచగా ఎయిర్‌టెల్ 11 నుంచి 21 శాతం వరకు పెంచేసింది.
జూలై 3 నుంచి జియో కొత్త చార్జీలు..
జియో కొత్త టారిఫ్‌లు జూలై 3 నుంచి అమలులోకి వస్తాయని సంస్థ ప్రకటించింది. రెండున్నరేళ్ల తర్వాత టారిఫ్‌లు పెంచుతున్నట్లు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాశ్ అంబానీ తెలిపారు. దాదాపు అన్ని టారిఫ్‌ల రేట్లు పెంచినట్లు పేర్కొన్నారు.
జియో టారిఫ్‌లు ఇలా..
– 1 జీబీ డేటా యాడ్ ఆన్ ప్యాక్ ధర గతంలో రూ.15 ఉండగా 27 శాతం పెంచి రూ.19 చేసింది. ఇదే అతితక్కువ రీచార్జి ధర.
– రూ.666 అన్‌లిమిటెడ్ ప్లాన్(84 రోజుల) ధరను 20 శాతం పెంచింది. దీనిని జూలై 3 నుంచి రూ.799కు చేర్చింది.
– వార్షిక రీచార్జి ప్లాన్లను 20–21 శాతం పెంచింది. రూ.1,559 ప్లాన్ ధరను రూ.1,899కి , రూ.2,999 ప్లాన్ ధరను రూ.3,599కి సవరించింది. రోజుకు 2జీబీ, అంతకు మించి డేటా లభించే పథకాలకు అన్‌లిమిటెడట్ 5జీ సదుపాయాన్ని వర్తింపజేస్తామని ప్రకటించింది.
ఎయిర్‌టెల్ చార్జీలు ఇలా…
– రూ.199 ప్లాన్ : గతంలో దీని ధర రూ.179 ఉండేది. ఇందులో 2జీబీ డేటా, అపరిమిత కాలింగ్, 28 రోజుల వ్యాలిడిటీ ఉండేది.
– రూ.509 ప్లాన్… ఇంతకుముందు దీని ధర రూ.455 ఉండేది. ఇందులో 6 జీబీ డేటా, అపరిమిత కాల్స్ రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లతో 84 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది.
– రూ.1,999 ప్లాన్.. గతంలో రూ.1,799 ఉన్న ఈ ప్లాన్‌లో 24 జీబీ డేటా, అపరిమిత కాలింగ్, 365 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది.
– రూ.299 ప్లాన్.. ఇంతకు ముందు రూ.265 ఉన్న ప్లాన్‌ను రూ.299కు పెంచింది. ఇందులో రోజుకు 1 జీబీ డేటా, 28 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత కాలింగ్ ఉంటుంది.
– రూ.349 ప్లాన్.. ఇది గతంలో రూ.299 ప్లాన్‌గా ఉంది. ఇందులో రోజుకు అపరిమిత కాల్‌స, 1.5 జీబీ డేటా,28 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది.
– ప్లాన్ రూ.409.. ఇది గతంలో రూ.359 ఉండేది. ఇందులో రోజుకు 2.5 జీబీ డేటా, అపరిమిత కాలింగ్‌తో 28 రోజుల వ్యాలిడిటీ ఉండేది.
– రూ.579 ప్లాన్.. ఇతకుముందు దీని ధర రూ.479 ఉంది. ఇందులో రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత కాలింగ్, 56 రోజుల వ్యాలిడిటీ ఉండేది.
– రూ.649 ప్లాన్.. గతంలో రూ.549 ధర ఉండేది. ఇందులో రోజుకు 2 జీబీ డేటా, అపరిమిత కాలింగ్, 56 రోజుల వ్యాలిడిటీ ఉంది.
– రూ.859 ప్లాన్.. ఇంతకుముందు రూ719. ఇందులో రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత కాలింగ్, 84 రోజుల వ్యాలిడిటీ ఉంది.
– రూ.979 ప్లాన్.. గతంలో ఇది రూ.839. ఇందులో రోజుకు 2జీబీ డేటా, అపరిమిత కాలింగ్, 84 రోజుల వ్యాలిడిటీ ఉంది.
– రూ.3,599 ప్లాన్.. ఇంతకుముందు ఇది రూ.2,999గా ఉంది. ఇందులో రోజుకు 2 జీబీ డేటా, అపరిమిత కాలింగ్, 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తాయి.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Airtel announces mobile tariff hike heres the complete list of new plans and prices
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com