Scholarship for Btech Students:అఖిల భారత సాంకేతిక విద్యామండలి బీటెక్ చదువుతున్న విద్యార్థులకు తీపికబురు అందించింది. ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం ఏఐసీటీఈ స్కాలర్ షిప్ లను అందిస్తోంది. 2022 సంవత్సరం జనవరి 31వ తేదీ ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది. ఎవరైతే ఈ స్కాలర్ షిప్ కు ఎంపికవుతారో వాళ్లకు సంవత్సరానికి 50,000 రూపాయల చొప్పున స్కాలర్ షిప్ లభిస్తుంది.
https://aicte-india.org/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఏఐసీటీఈ అధికారిక వెబ్ సైట్ ద్వారా స్కాలర్ షిప్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. వెబ్ సైట్ లోని మార్గదర్శకాలను చదివిన తర్వాతే ఈ స్కాలర్ షిప్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్ సైట్ లో స్కాలర్ షిప్స్ ఆప్షన్ ను క్లిక్ చేసి దరఖాస్తు ఫారమ్ ను నింపి అభ్యర్థులకు అవసరమైన సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది.
Also Read: ట్రెండింగ్ న్యూస్.. ఏడాదిలో 3 వేల కోట్ల అప్పు తీర్చిన మహిళ..!
ఎవరైనా సమాచారాన్ని తప్పుగా అందిస్తే వాళ్ల స్కాలర్ షిప్స్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో స్కాలర్ షిప్స్ ను అందిస్తుండటం గమనార్హం. స్వనాథ్ స్కాలర్‌షిప్ పీజీ, సక్షం స్కాలర్‌షిప్ పథకం, ప్రగతి స్కాలర్‌షిప్ (బాలికలు) అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు స్కాలర్ షిప్ కోసం వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది.
ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ 2021 సంవత్సరంలో ఈ స్కాలర్ షిప్ స్కీమ్ ను మొదలుపెట్టింది. అర్హత ఉన్న బాలికలతో పాటు వికలాంగులు ఈ స్కాలర్ షిప్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కాలర్ షిప్ కోసం ఎంపికైన బాలికలకు ఏకంగా 50,000 రూపాయల వరకు స్కాలర్ షిప్ లభిస్తుంది. అర్హత ఉన్నవాళ్లకు ఈ స్కాలర్ షిప్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.
Also Read: పది అర్హతతో మంచి వేతనంతో జాబ్స్.. ఎలా దరఖాస్తు చేయాలంటే?