Tax Saving Tips: దేశంలోని ప్రజలలో చాలామంది వేతనంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి కేసులు పెరుగుతుండటంతో ప్రజలకు ఆదాయంతో పోలిస్తే ఖర్చులు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ పన్నులకు సంబంధించి కొత్త నిర్ణయాలను అమలులోకి తీసుకొస్తుండటంతో ప్రజలపై ఊహించని స్థాయిలో భారం పెరుగుతుండటం గమనార్హం. సెక్షన్ 80c కాకుండా ఆదాయపు పన్నును మార్చడానికి ఇతర మార్గాలు కూడా ఉన్నాయి.
సెక్షన్ 80ggb, సెక్షన్ 80ggc కింద రాజకీయ పార్టీలకు విరాళాలను ఇస్తే ఆ విరాళాలకు సంబంధించి డబ్బును ఆదా చేసే అవకాశం అయితే ఉంటుంది. వ్యక్తులు లేదా కంపెనీలు ఈ విధంగా ఆదాయపు పన్నును ఆదా చేసే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. సెక్షన్ 80u ద్వారా వికలాంగ పన్ను చెల్లింపుదారులు రూ.75,000 తగ్గింపును క్లెయిమ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
వైకల్యం తీవ్రంగా ఉంటే 1,25,000 రూపాయల వరకు క్లెయిమ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. సెక్షన్ 80ddb ద్వారా ప్రత్యేక అనారోగ్యం కొరకు చికిత్స పొందుతున్న వాళ్లు 60 సంవత్సరాల లోపు వయస్సు ఉంటే 40,000 రూపాయల వరకు 60 సంవత్సరాలకు పైగా వయస్సు ఉంటే లక్ష రూపాయల వరకు తగ్గింపును పొందవచ్చు. నిషేధంలో సేవింగ్స్ ఖాతా ఉన్న వ్యక్తులు 10,000 రూపాయల వరకు ట్యాక్స్ తగ్గింపును పొందవచ్చు.
Also Read: ట్రెండింగ్ న్యూస్.. ఏడాదిలో 3 వేల కోట్ల అప్పు తీర్చిన మహిళ..!
స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇచ్చిన మొత్తంలో 50 శాతం లేదా 100 శాతం క్లెయిమ్ చేసుకోవచ్చు. హె.ఆర్.ఏ పొందని వ్యక్తులు 5,000 రూపాయల వరకు డబ్బును ఆదా చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్న వాళ్లు సెక్షన్ 80ఈ కింద పన్ను మినహాయింపు బెనిఫిట్స్ ను పొందవచ్చు. మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసేవాళ్లు 50,000 రూపాయల వరకు పన్ను మినహాయింపు బెనిఫిట్స్ ను పొందవచ్చు.
ఆరోగ్య బీమా ప్రీమియంలపై పన్ను మినహాయింపును బెనిఫిట్స్ ను పొందవచ్చు. స్వీయ బీమా కోసం రూ. 25,000 ఆదా చేసుకునే ఛాన్స్ ఉండగా 60 సంవత్సరాల వయస్సు పైబడిన వాళ్ల కోసం లక్ష రూపాయల వరకు పన్ను ఆదా చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి.
Also Read: బీటెక్ విద్యార్థులకు రూ.50,000 స్కాలర్ షిప్.. ఎలా పొందాలంటే?