AI+ Nova Flip price: భారతదేశంలో స్మార్ట్ ఫోన్ వినియోగదారులు పెరిగిపోతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసిన మొబైల్స్ ను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. ఇందులో భాగంగా AI+నోవా ప్లిప్ తో పాటు AI+నోవా 2 అనే కొత్త ఫోన్లు అలరించబోతున్నాయి. ఈ మేరకు ఏప్రిల్ 9న ఈ మొబైల్స్ ను లాంచ్ చేశారు. ఈ మొబైల్స్ డ్యూయెల్ కెమెరాలను కలిగి ఉండడంతో పాట బలమైన బ్యాటరీ వ్యవస్థతో పనిచేయనున్నాయి. వీటిలో ఉండే ఫీచర్స్, ధర వివరాల్లోకి వెళితే..
ఏఐ + నోవా 2 సిరీస్ డిస్ ప్లే ను చూస్తే వెంటనే కొనేయాలని అనిపిస్తుంది. ఇందులో 6.78 అంగుళాల 1.5 కే రిజల్యూషన్ తో కూడిని AMOLED డిస్ ప్లేను కలిగి ఉంది. ఇది 144 రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. ఇందులో ఆక్టాకోర్ యూనిసోక్ టీ 8200 చిప్ సెట్ ఉండనుంది. ఇది 6 జీబీ ర్యామ్, 128 జీబి స్టోరేజ్ తో పనిచేస్తుంది. దీంతో మల్టీ టాస్కింగ్ కోసం యూస్ చేసేవారికి ఇది సపోర్టుగా ఉంటుంది.
ఈమొబైల్ లో డ్యూయెల్ కెమెరాను చూడొచ్చ. ఇందులో రియర్ కెమెరా యూనిట్ ను కలిగి ఉంది. ఇది సోనీ ఐఎంఎక్స్ 752 సెన్సార్ తో పనిచేస్తుంది. 50 మెగా పిక్సెల్ తో కూడిన బ్యాక్ కెమెరా ఉండగా.. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 8 ఎంపీ కెమెరా పనిచేస్తుంది. 6000 mAh బ్యాటరీ ఉండగా.. ఈ బ్యాటరీకి 33 వాట్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు చేస్తుంది. అలాగే 18 వాట్ వైర్ లెస్ చార్జింగ్ కు సపోర్టు ఇస్తుంది. ఈ మొబైల్ 6 జీబి ర్యామ్ తోపాటు 128 జీబీ తో కొనుగోలు చేయాలని అనుకుంటే రూ.16,999తో విక్రయిస్తన్నారు. ఏప్రిల్ 17 నుంచి ఇది అందుబాటులోకి రానుంది.
ఏఐ +నోవా ప్లిప్ ఫోన్ మొబైల్ లో 6.74 అంగుళాల డిస్ ప్లేను చూడొచ్చు. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. ఇందులో 740 మీడియాటెక్ డైమెన్సిటీ చిప్ సెట్ ఉండనుంది. ఇది 8 జీబీ వరకు ర్యామ్ సపోర్ట్ చేయడగా.. 128 జీబీ వరకు స్టోరేజ్ ఉండనుంది. ఇందులో కెమెరా 50 మెగా పిక్సెల్ తో కూడిన బ్యాక్ కెమెరా ఉండగా.. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 8 ఎంపీ కెమెరా పనిచేస్తుంది.ఈ మొబైల్ లోనూ బ్యాటరీ 6000 mAh బ్యాటరీ ఉండగా.. ఈ బ్యాటరీకి 33 వాట్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు చేస్తుంది. అలాగే 18 వాట్ వైర్ లెస్ చార్జింగ్ కు సపోర్టు ఇస్తుంది. దీనిని రూ.10,999తో విక్రయించే అవకాశం ఉంది. ఏప్రిల్ 14 నుంచి ఇది అందుబాటులోకి రానుంది.