Aditya Ram Success Story: తల్లిదండ్రులు డబ్బు బాగా సంపాదిస్తే తమ పిల్లలు కూడా మరింత డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది. ఇందులో ఆ వ్యక్తి సాధించిన విజయం అంటూ ఏమీ ఉండదు. కానీ చిన్నప్పుడు పేదరికంలో లేదా మధ్యతరగతిలో ఉన్నవారు ఊహించనంత డబ్బు సంపాదించడం అంటే అతడు తన జీవితంలో విజయాన్ని సాధించినట్టే. అందులోనూ దేశంలోనే అందరూ చర్చించుకునే విధంగా భవనాలు కట్టడం.. ప్రత్యేకంగా నిలవడం సాధ్యమయ్యే పని కాదు. కానీ ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక వ్యక్తి మధ్యతరగతి కుటుంబంలో జన్మించి ప్రస్తుతం 700 కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించాడు. అంతేకాకుండా దక్షిణ భారతదేశంలోనే అందరూ ఆశ్చర్యపోయేలా భవనాన్ని నిర్మించాడు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆ వ్యక్తి కొన్ని సక్సెస్ఫుల్ తెలుగు సినిమాలను కూడా నిర్మించాడు. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా?
సందడే సందడి.. ఖుషి ఖుషి గా.. ఏక్ నిరంజన్ వంటి కొన్ని సినిమాల గురించి అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమాలను నిర్మించింది ఎవరో నిర్మాత అని అందరూ అనుకుంటారు. కానీ ఈ సినిమాల నిర్మించిన నిర్మాత ప్రస్తుతం 700 కోట్ల సామ్రాజ్యానికి అధిపతి. ఆయనే ఆదిత్యారామ్.. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా జగన్నాధపురం లో జన్మించిన ఆదిత్య రామ్ ది చిన్నప్పుడు మధ్యతరగతి కుటుంబం. అయితే తనదైన శైలిలో ప్రతిభను పెంచుకొని చెన్నైకి వెళ్ళిన అతడు రియల్ ఎస్టేట్ రంగంలో రాణించాడు. ఆదిత్య గ్రూప్ ను ప్రారంభించి అనేక పెట్టుబడులను పెట్టాడు. ఇదే సమయంలో సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. అయితే ఇవన్నీ మిగతావారు కూడా చేశారు. ఇందులో ఈయన ప్రత్యేకత ఏముంది అని అనుకోవచ్చు.
మనం ఇప్పుడు చూస్తున్నా కొన్ని భవనాలు ఒకప్పుడు రాజులు, ఆంగ్లేయులు నిర్మించారు. ఈ కాలంలో పెద్దపెద్ద భవనాలు నిర్మించడానికి ఎవరు సాహసం చేయడం లేదు. అయితే ఆదిత్యా రామ్ మాత్రం చెన్నైలోని పనైయూర్ లో ఎనిమిది ఎకరాల్లో అత్యంత సుందరమైన భవనాన్ని నిర్మించారు. ఇది దక్షిణా భారత దేశంలోనే అత్యంత విశాలమైన భవనం గా గుర్తించబడింది. ఇందులో ఇల్లాలు, భవనాలు కలిసి ఉన్నాయి.అంతేకాకుండా ఆదిత్యా రామ్ ఈ భవనంలో అనేక సకల సౌకర్యాలు ఏర్పాటు చేసి.. తనకు నచ్చిన కార్లను కొనుగోలు చేశాడు. ఇలా తనకు వచ్చిన సంపాదనతో ఇంత పెద్ద భవనాన్ని నిర్మించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
కేవలం డబ్బు సంపాదనలో మాత్రమే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ఆదిత్యారాం పాలు పంచుకుంటాడు. అవసరమైన వారికి ఆర్థిక సహాయం చేస్తూ.. పేదలకు కావలసిన సౌకర్యాలను అందిస్తూ ప్రత్యేకంగా నిలుస్తున్నాడు. చిన్నప్పుడు ఎలాంటి విలాస జీవితం కనిపించని ఆయన ఇప్పుడు అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ.. అద్భుతమైన భవనాన్ని నిర్మించి అందరిలో ప్రత్యేకంగా నిలిచాడు. జీవితంలో పైకి ఎదగాలని అనుకునే వారికి ఆదిత్య రామ్ నేటి యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. 2025 ఆర్థిక సంవత్సరం నాటికి ఆదిత్యారామ్ నికర విలువ రూ. 700 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.