Activa CNG: నగరాల్లో ప్రయాణం చేసేవారు వాహనంపై ప్రయాణం చేసినప్పుడు అట్రాక్టివ్ గా కనిపించాలని ప్రత్యేకంగా కొన్ని స్కూటర్లను కొనుగోలు చేస్తుంటారు. ఇలాంటి వారి కోసం ఇప్పటికే Honda కంపెనీ Activa వంటి బైక్స్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఆ తర్వాత చాలా కంపెనీలు ఇలాంటి స్కూటర్లను మార్కెట్లోకి తీసుకువచ్చాయి. కానీ ఇప్పుడు కొత్తగా హోండా కంపెనీ యాక్టివా ను CNG వేరియంట్ లో ప్రవేశపెట్టింది. దీంతో పెట్రోల్ ఖర్చులు భారం అవుతున్నాయని అనుకునేవారు దీనిని కొనుగోలు చేసి తక్కువ ధరలోనే తమ అవసరాలను తీర్చుకోవచ్చు. అంతేకాకుండా ఈ కొత్త స్కూటర్లో స్మార్ట్ టెక్నాలజీ ఉండడంతో స్మూత్ డ్రైవింగ్ ఉండరుంది. ఇంకా ఈ స్కూటర్లో ఏమేం ఉన్నాయో చూద్దాం.
రోజువారి ప్రయాణికులతో పాటు నగరాల్లో ఉండే వారి అవసరాల కోసం.. అన్ని వర్గాల వారికి అనుగుణంగా ఉండేందుకు Honda కంపెనీ Activa CNG మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ స్కూటర్ డిజైన్ స్టైలిష్ గా తీర్చిదిద్దారు. ముఖ్యంగా ఫ్రంట్ భాగంలో ఇప్పటివరకు ఏ స్కూటర్ లేనివిధంగా స్మార్ట్ లుక్ తో కనిపిస్తుంది. ఈ స్కూటర్లో రెండు రకాల ఇంజన్లను అమర్చారు. ఒకటి పెట్రోల్ ఇంజన్ ఉండగా..CNG ఇంజన్ సెట్ అప్ చేశారు. ఈ రెండు ఇంజిన్ లో వినియోగదారులు తమకు అనుకూలంగా మార్చుకునే విధంగా సౌకర్యంగా ఉంటుంది. దీంతో నగరాల్లో ఉండే వారికి తొందరగా గమ్యం చేరుకోవాలని అనుకున్నప్పుడు ఈ ఇంజన్లు ఉపయోగపడతాయి. రైడర్లు ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రయాణం చేయవచ్చు. ఈ రెండు ఇంజన్లు కలిపి 310 కిలోమీటర్ల మైలేజ్ వరకు వెళ్లొచ్చు. రోజువారి వినియోగదారులకు ఇది అనుగుణంగా ఉంటుంది.
ఈ స్కూటర్లో సామాగ్రిని తీసుకురావడానికి ప్రత్యేకమైన సెటప్ చేశారు. ప్రత్యేకంగా వస్తువులను స్టోర్ చేసుకోవడానికి సీట్ కింద స్పేస్ ను ఉంచారు. అలాగే ట్యూబ్ లెస్ టైర్లు, drum break మెయింటెనెన్స్ ఖర్చులను తగ్గిస్తుంది. రైడర్ కు కంఫర్ట్ గా ఉండి ఎలాంటి అలసట లేకుండా ప్రయాణం చేయడానికి సీటు నిటారుగా ఉండనుంది. దూర ప్రయాణాలు చేసినప్పుడు పెట్రోల్ ఇంజన్ ను ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ రెండు రకాల ఇంజన్లు ఉన్న ఈ స్కూటర్ ధర మధ్యతరగతి ప్రజలకు అనుగుణంగానే నిర్ణయించారు. దీనిని మార్కెట్లో రూ.70,000 నుంచి రూ.80,000 మనకు విక్రయించే అవకాశం ఉంది. తక్కువ ధరలోనే స్కూటర్ రావడంతో పాటు అత్యధిక మైలేజ్ ఇస్తుండడంతో దీని కొనుగోలుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. అంతేకాకుండా CNG స్టేషన్లో అందుబాటులో ఉన్నవారు ఇంధన ఖర్చులను సేవ్ చేసుకోవచ్చు.