Mercedes Benz E Class: కార్లు కొనుగోలు చేసే సమయంలో కొందరు రోజువారి అవసరాలతో పాటు.. ఫ్యామిలీ అవసరాల కోసం ఆలోచిస్తారు. మరికొందరు మాత్రం లగ్జరీగా ప్రయాణం చేయాలని.. స్టైలిష్ గా వెహికల్ ఉండాలని అనుకుంటారు. ఇలాంటి సమయంలో కారు ధర ఎంతైనా వెచ్చించడానికి వెనుకాడరు. ఇలాంటి వారి కోసం Mercedace కంపెనీ డిఫరెంట్ కార్లను ప్రవేశపెట్టింది. అయితే నేటి వారికి అనుగుణంగా.. లేటెస్ట్ టెక్నాలజీతో కార్లను తీసుకురావాలని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంది. ఇందులో భాగంగా 2026 కొత్త సంవత్సరంలో స్మార్ట్ టెక్నాలజీ తో పాటు శక్తివంతమైన ఇంజన్ ను కలిగిన కొత్త కారును ఆవిష్కరించింది. ఈ కారు ఎలా ఉందంటే.
Mercedace నుంచి కొత్తగా Benz E Class అనే కారు ఆవిష్కరించబడింది. సాధారణంగానే బెంజ్ కారు ప్రత్యేక లుక్ తో ఉంటుంది. అయితే ఈ కొత్త కారు మరింత ప్రీమియం లుక్ ను అందిస్తుంది. అప్డేట్ చేసిన ఫ్రంట్ గ్రిల్, LED హెడ్ లాంప్స్ ఎరో డైనమిక్ లుక్ ను తీసుకొచ్చాయి. ప్రీమియం అలాగే వీల్స్, బ్యాక్ సైడ్ స్టైలిష్ గా ఉండే టెయిల్ లాంప్స్ వినియోగదారులను ఇంప్రెస్ చేస్తుంది. ఈ కారులో ప్రయాణం చేస్తే రిచ్ లుక్ రావడంతో పాటు ఎదుటివారి దృష్టిలో ప్రత్యేకంగా కనిపిస్తారు.
ఈ కొత్త కారులో ఇంజన్ వ్యవస్థ కూడా మెరుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో టర్బో ఛార్జ్డ్ గ్యాసోలిన్ హైబ్రిడ్ టెక్నాలజీ ఇంజన్ ను చేర్చారు. ఇది నగర ప్రయాణికులతో పాటు లాంగ్ జర్నీ చేసే వారికి సపోర్ట్ గా ఉండనుంది. ముఖ్యంగా ప్రయాణంలో ప్రత్యేక అనుభూతి పొందడానికి ఇంజన్ సున్నితత్వాన్ని అందిస్తుంది. సస్పెన్షన్ ట్యూన్ చేయడంతో ఎలాంటి రోడ్లపై నైనా సులభంగా వెళ్లే విధంగా ఉంటుంది.
ఈ కారులో ఉండే స్మార్ట్ టెక్నాలజీ డ్రైవర్లను మెస్మరైజ్ చేస్తుంది. సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ తో పాటు విశాలమైన లెగ్ రూమ్ ఉండడంతో పాటు వెంటిలేషన్ స్వచ్ఛమైన వాతావరణాన్ని అందిస్తుంది. సౌండ్ ఇన్ సొల్యూషన్ క్యాబిన్ ఉండడంతో ప్రశాంతమైన శబ్దం లేకుండా ప్రయాణం చేయవచ్చు. అలాగే ఇందులో ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, పెద్ద డిజిటల్ డిస్ప్లే, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లేటెస్ట్ టెక్నాలజీ తో కూడుకొని ఉన్నాయి. వాయిస్ కమాండర్, నావిగేషన్, ఓవర్ ది ఎయిర్ అప్డేట్ యాజమాన్యం సహజంగా ఉండేలా తలపిస్తుంది.
ఈ కారులో సేఫ్టీ ఫీచర్స్ ఎక్కువే అని చెప్పుకోవచ్చు. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేని కీపింగ్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, ట్రాఫిక్ సైన్ రికగ్నైజేషన్ వంటివి డ్రైవర్లకు అనుగుణంగా ఉంటూ సేఫ్టీని ఇస్తాయి. అంతేకాకుండా సుదూర ప్రయాణాలు చేసినా కూడా ప్రయాణికుల భద్రత కలగడంతో ఎలాంటి అలసట లేకుండా ఉండగలుగుతారు. దీనిని రూ.78.51 లక్షల ప్రారంభ ధర నుంచి రూ.92.50 లక్షల వరకు విక్రయిస్తున్నారు.