Maruthi car Sales : ఆగస్టు సేల్స్ లో దుమ్మురేపిన మారుతి కారు.. కొనేందుకు ఎగబడుతున్నారు..

మారుతి కంపెనీకి చెందిన ఓ మోడల్ గత నెల ఆగస్టులో టాప్ లెవల్లో అమ్మకాలు జరుపుకుంది. ఈ అమ్మకాలు గత సంవత్సరంతో పోలిస్తే తక్కువే అయినప్పటికీ ఇప్పుడున్న కార్ల కంటే ఇది టాప్ లెవల్లో దూసుకుపోయింది. ఇంతకీ మారుతికి చెందిన ఏ కారు ఎక్కువ సేల్స్ నమోదు చేసుకుంది? ఆ కారు ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయి?

Written By: Chai Muchhata, Updated On : September 12, 2024 5:45 pm

Maruthi car Sales

Follow us on

Maruthi car Sales :  కారు కొనాలనుకునే వారు ఎక్కువగా మారుతి కంపెనీ వైపు చూస్తారని కొందరు ఆటోమోబైల్ నిపుణులు పేర్కొంటారు. ఎందుకంటే సరసమైన ధరలకు అన్ని వర్గాలకు అందుబాటులో ఈ కార్లు ఉంటాయి. అంతేకాకుండా వినియోగదారులను ఆకట్టుకునే విధంగొ లేటేస్ట్ టెక్నాలజీతో ఈ కంపెనీ కార్లు మార్కెట్లోకి వస్తాయి. ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన వ్యాగన్ ఆర్, స్విప్ట్ తదితర కార్లు సక్సెస్ అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మారుతి కంపెనీకి చెందిన ఓ మోడల్ గత నెల ఆగస్టులో టాప్ లెవల్లో అమ్మకాలు జరుపుకుంది. ఈ అమ్మకాలు గత సంవత్సరంతో పోలిస్తే తక్కువే అయినప్పటికీ ఇప్పుడున్న కార్ల కంటే ఇది టాప్ లెవల్లో దూసుకుపోయింది. ఇంతకీ మారుతికి చెందిన ఏ కారు ఎక్కువ సేల్స్ నమోదు చేసుకుంది? ఆ కారు ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయి?

ఇటీవల మారుతి కంపెనీ రిలీజ్ చేసిన సేల్స్ రిపోర్ట్ ప్రకారం 2024 ఆగస్టు నెలలో మారుతికి చెందిన బాలెనో కారు 12,485 యూనిట్లు విక్రయాలు జరుపుకుంది. 2023లో ఇదే మోడల్ 18,653 యూనిట్లు విక్రయించారు. అయితే ఈ గత సంవత్సరంతో పోలిస్తే తక్కువగా ఉన్నా.. ఈసారి విక్రయించబడిన కార్ల కంటే బాలెనో పై స్థాయిలోనే ఉంది. పండుగల సీజన్ ప్రారంభం కావడంతో పాటు కార్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో బాలెనో ను ఎక్కువగా ఆదరించారు. అయితే బాలెనో కారును ఎక్కువగా కోరుకోవడానికి కారణాలు ఉన్నాయి. అవేంటంటే?

బాలెనో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పనిచేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ను కలిగి ఉంది. ఈ ఇంజిన్ తో ఈ మోడల్ 22.35 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇందులో సీఎన్ జీ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. సీఎన్ జీ వేరియంట్ లో 30.61 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. సిగ్మా, అల్పా, డేటా సహా వివిధ వేరియంట్లు కలిగిన బాలెనో నెక్సా బ్లూ, గ్రాండియర్ గ్రే వంటి ఆకర్షణీయమైన కలర్లతో అందుబాటులో ఉంటుంది. కానీ ఎక్కువ మంది గ్రాండియర్ గ్రే కలర్ ను ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది.

మారుతి బాలెనో కారు ఫీచర్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇందులో 9 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది. ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఫుష్ బటన్ కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్లు ఆకర్షిస్తాయి. అలాగే ఆటో, క్రూయిజ్ కంట్రోల్ వంటివి ఉఏన్నాయి. వీటితో పాటు లేటేస్ట్ టెక్నాలజీతో కూడిన ఫీచర్లు ఉన్నాయి. సేప్టీ విషయంలోనూ బాలెనో ఏమాత్రం తగ్గేదేలే అంటోంది. ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్, యాంటి బ్రేకింగ్ సిస్టమ్, 3 పాయింట్ సీట్ బెల్ట్, రియర్ పార్కింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

బాలెనో ప్రస్తుతం మార్కెట్లో 6. 66 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. టాప్ ఎండ్ వేరియంట్ 9.83 లక్షలుగా ఉంది. ఇది హ్యాచ్ బ్యాక్ కారు అయినప్పటికీ ఎస్ యూవీ తరహాలో ఆకట్టుకుంటుంది. ఎందుకంటే ఇందులో 318 లీటర్ల బూట్ స్పేస్ ను కలిగి ఉంది. అంతేకాకుండా ఇది చూడడానికి ఆకర్షణీయంగా ఉంటూ ప్రీమియం లుక్ ను కలిగిస్తుంది.